Mumbai, July 27: కరోనావైరస్ లాక్డౌన్ మధ్య భారతీయులలో వేలాది మంది వలస కార్మికులు (Migrants) తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి నటుడు సోను సూద్ (Actor Sonu Sood) చేసిన సహాయం ఎవరూ మరచిపోరు. సోషల్ మీడియాలో (Social Media) ఇప్పుడు ఆయన హీరో అయ్యారు. తాజాగా ఏపీలో ఓ రైతు కష్టాన్ని చూసి చలించి ఆయన ఇంటికి నేరుగా ట్రాక్టర్ పంపిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతి ఒక్కరూ సోనూ సూద్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సోనూసూద్ సాయం వెనుక కథ ఏంటి? ట్రాక్టర్ తీసుకున్న రైతు ఏమంటున్నారు, సోనూసూద్ గొప్ప మనసుపై సోషల్ మీడియా వేదికగా పొగడ్తల వర్షం
ఇప్పుడు మళ్లీ ఈ సినీ విలన్ కొత్త మిషన్ చేపట్టేందుకు రెడీ అయ్యారు. ట్విట్టర్లో ఓ నెటిజన్ జార్జియా (Georgia) టిబిలిసిలో సుమారు 50 మంది ప్లస్ విద్యార్థులు ఉన్నారు, వారు టిబిలిసి నుండి భారతదేశానికి తిరిగి రావాలని కోరుకుంటారు. దయచేసి సహాయం చేయండి. నేను పగలు, రాత్రి ట్వీట్ చేస్తున్నాను. దయచేసి నా సోదరుడిని తిరిగి తీసుకురండి. మా తాత కాలం చేశారు. కుటుంబం తీవ్ర నిరాశలో ఉంది. అని ట్వీట్ చేశారు. దీనికి సోనూ సూద్ స్పందిస్తూ.. న్యూ మిషన్ ఆన్ ఇట్ (Sonu Sood New Mission) అని రిప్లయి ఇచ్చారు. జార్జియాలో చిక్కుకున్న 50 మందికి పైగా భారతీయ విద్యార్థుల బృందానికి సహాయం చేస్తానని ప్రతిజ్ఞ చేసాడు.
Here's sonu sood New mission :
New mission 😳
On it🤞 https://t.co/YYKOuztZqj
— sonu sood (@SonuSood) July 27, 2020
సోషల్ మీడియాల ట్విట్టర్లో ఈ నటుడు చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. దేశంలోని వివిధ వ్యక్తుల నుండి అనేక సహాయ అభ్యర్థనలను స్వీకరిస్తున్నారు మరియు వారికి ఆసక్తిగా స్పందిస్తున్నారు.అంతకు ముందు కూడా Krygyzstan నుండి ఉత్తర ప్రదేశ్ కి తిరిగి రావడానికి ఇండియా విద్యార్థలకు సాయం చేసి కోట్లాది మంది హృదయాలను సోనూ సూద్ గెలుచుకున్నాడు