Rajinikanth Hospitalised in Chennai: చెన్నైలోని దవాఖానలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్.. నేడు గుండె సంబంధిత వైద్య ప‌రీక్ష‌లు

సోమవారం అర్థరాత్రి చెన్నైలోని ఆపోలో దవాఖానలో ఆయన చేరినట్టు సమాచారం.

Credits: Twitter

Chennai, Oct 1: తన స్టైల్, మేనరిజమ్స్ తో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకొన్న సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ఆసుపత్రిలో (Hospital) చేరారు. సోమవారం అర్థరాత్రి చెన్నైలోని ఆపోలో దవాఖానలో ఆయన చేరినట్టు సమాచారం. నేడు ఆయ‌న‌కు గుండె సంబంధిత వైద్య ప‌రీక్ష‌లు చేయనున్నట్టు దవాఖానవర్గాల ద్వారా తెలిసింది. అయితే, ర‌జ‌నీకాంత్ ఆరోగ్య‌ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెప్పిన‌ట్లు స‌మాచారం. కాగా, ఆయ‌న‌ ఆసుప‌త్రిలో చేర‌డంపై వైద్యుల‌ నుంచి గానీ, కుటుంబ సభ్యుల నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఆయన అభిమానులు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, దాదాపు పదేండ్ల కిందట సింగపూర్‌ లో రజనీ కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు.

కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు షాక్.. మళ్లీ పెరిగిన రేట్లు.. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ.50 మేర పెంచుతున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రకటన

అలా రాజకీయాలకు దూరంగా..

రజనీ ఆరోగ్య కారణాలతోనే రాజకీయాలకు కూడా దూర‌మ‌య్యారు. రాజ‌కీయ అరంగేట్రానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న ర‌జ‌నీకాంత్‌ చివ‌రి నిమిషంలో వైద్యుల స‌ల‌హా మేర‌కు త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్న సంగ‌తి తెలిసిందే.

ఎన్నికల బాండ్ల బెదిరింపుల కేసు, బీజేపీ నేతలకు ఊరటనిచ్చిన కర్ణాటక హైకోర్టు, కేసు విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ