Thalapathy Vijay Birthday: తమిళనాడులో వైయస్ జగన్ హవా, విజయ్ బర్త్‌డే సంధర్భంగా పోస్టర్లలో ఏపీ సీఎం ఫోటో, విజయే రేపటి సర్కారును నిర్ణయించే సర్కార్ అంటూ క్యాప్షన్

ఆయన పుట్టిన రోజు సంధర్భంగా తమిళనాడులో వెలసిన పోస్టర్లు సంచలనంగా మారాయి. విజయ్ పుట్టిన రోజుపై బ్యానర్లను ఏర్పాటు చేసిన అబిమానులు అంందులో ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS Jagan) ఫోటోని పెట్టారు. ఇది సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. సూపర్ స్టార్ విజయ్ పుట్టినరోజు ( Happy Birthday Thalapathy) సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన బ్యానర్లలో విజయ్ ఫోటోతో పాటు ఏపీ సీఎం వైఎస్ జగన్ చిత్రాలు ముద్రింపబడ్డాయి.

Andhra Pradesh CM YS Jagan posters with actor Vijay spotted in Tamil Nadu (Photo-Twitter)

Chennai, June 22: నేడు తమిళ్ తలపతి విజయ్ పుట్టిన రోజు (Thalapathy Vijay Birthday). ఆయన పుట్టిన రోజు సంధర్భంగా తమిళనాడులో వెలసిన పోస్టర్లు సంచలనంగా మారాయి. విజయ్ పుట్టిన రోజుపై బ్యానర్లను ఏర్పాటు చేసిన అబిమానులు అంందులో ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS Jagan) ఫోటోని పెట్టారు. ఇది సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. సూపర్ స్టార్ విజయ్ పుట్టినరోజు ( Happy Birthday Thalapathy) సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన బ్యానర్లలో విజయ్ ఫోటోతో పాటు ఏపీ సీఎం వైఎస్ జగన్ చిత్రాలు ముద్రింపబడ్డాయి. రానున్న మూడు రోజులు ఏపీలో వర్షాలు, కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ఆదివారం తడిసి ముద్దయిన విజయవాడ

తమ హీరో విజయ్ ని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్న ఫ్యాన్స్, ఆయన తండ్రి చంద్రశేఖర్ పైనా ఒత్తిడి పెంచుతున్నారు. వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికల్లో తమ అభిమాన నటుడు రాజకీయాల్లోకి రావాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ లా ఎదగాలని వారు కోరుకుంటున్నారు. ఇక ఆ బ్యానర్లలో ‘విజయే రేపటి సర్కారును నిర్ణయించే సర్కార్’ అంటూ క్యాప్షన్ ముద్రింపబడింది. ఇప్పుడు ఆ బ్యానర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

Here's Vijay Birthday Banner

ఇదిలా ఉంటే తమిళనాడులో అటు రాజకీయాల్లో ఉన్నవారికి ఇటు సినిమాల్లో ఉన్నవారికి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంటుందనే విషయం అందరికీ విదితమే. అయితే అక్కడ ఫ్యాన్స్ తమ హీరో పుట్టిన రోజులకు తమ అభిమాన నటుడితో పాటు అభిమాన నేత ఫోటోలను ఆయా బ్యానర్లపై పెడతారు. తమిళనాడులో ఏ వీధిలో చూసిన కనిపించే బ్యానర్లపై అక్కడి సూపర్ స్టార్ రజినీకాంత్, అజిత్, విజయ్ ల వంటి స్టార్ హీరోల ఫోటోలు కనపడతాయి. వారి పక్కనే నచ్చిన నేతల ఫోటోలు కూడా ముద్రించి ఉంటాయి.