Karate Kalyani: నేను పారిపోయే రకం కాదు, పరిగెత్తించే రకమని తెలిపిన కరాటే కళ్యాణీ, ఒంటరి మహిళ అంటే అంతా చులకనా అంటూ మీడియా ముందు ఫైర్

ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కల్యాణి సోమవారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చింది. తాను (Karate Kalyani) పారిపోయే రకం కాదని,ఎక్కడికి పారిపోలేదని స్పష్టం చేసింది.

Actress Karate Kalyani (Photo-Video Grab)

కరాటే కల్యాణి ఆదివారం నుంచి కనిపించకుండా పోయిందనే వార్తల నేపథ్యంలో ఆమె తాజాగా మీడియా ముందుకు వచ్చింది. ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కల్యాణి సోమవారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చింది. తాను (Karate Kalyani) పారిపోయే రకం కాదని,ఎక్కడికి పారిపోలేదని స్పష్టం చేసింది. తాను పాప తల్లిదండ్రులను తీసురావడానికి వెళ్లానని చెప్పింది. అనంతరం తాను ఎవరిని దత్తత తీసుకోలేదని, తన తల్లి విజయలక్ష్మి తనతో ఉండరని అందుకే ఆమెకు ఏం తెలియదు అని చెప్పింది.

పిల్లలను అమ్ముకోవడం ఎవరైనా చూశారా? అని, ఒంటరి మహిళ అంటే అంతా చులకనా? అంటూ పైర్‌ అయ్యింది. ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రలను ఆమె (Actress Karate Kalyani) మీడియాకు చూపించింది. దీంతో వారు చిన్నారి దత్తతపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా చిన్నారి తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, పిల్లలను పోషించలేక కరాటే కల్యాణి వద్ద ఉంచినట్లు అతడు తెలిపాడు. తన ఇంట్లోనే ఉన్నామని, స్టింగ్‌ ఆపరేషన్‌ చేసుకోండని ఆమె వ్యాఖ్యానించింది. కాగా ప్రాంక్‌ పేరుతో ఆసభ్యవీడియోలు చేస్తున్నాడంటూ యూట్యూబర్‌ శ్రీకాంత్‌పై కరాటే కల్యాణి దాడి చేసిన సంగతి తెలిసిందే. నడిరోడ్డుపై అర్థరాత్రి వీరిద్దరు కొట్టుకోవడం చర్చ దారితీసింది.

సినీ నటి కరాటే కల్యాణి VS యూట్యూబర్‌ శ్రీకాంత్‌రెడ్డి, రోడ్డు మీద బట్టలు చినిగేలా కొట్టుకున్నారు

దీంతో ఇద్దరి ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కరాటే కల్యాణి కనిపించకుండపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె అక్రమంగా చిన్నారి దత్తత తీసుకుందంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆదివారం చైల్డ్‌వెల్‌ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ వారు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. అంతేగాక చిన్నారి పాప దత్తతపై తమకు వివరణ ఇవ్వాలంటూ గతంలో ఆమెకు నోటిసులు ఇవ్వగా తాను స్పందించలేదని అధికారులు మీడియాకు తెలిపిన విషయం విదితమే.



సంబంధిత వార్తలు

Notice to Sajjala Bhargav: వైఎస్సార్సీపీ నేత‌ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, స‌జ్జ‌ల భార్గ‌వ్, వైఎస్ జ‌గ‌న్ బంధువు అర్జున్ రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు

No Pharma City In Kodangal: కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే

KTR: సీఎం రేవంత్‌కు రాజకీయ భవిష్యత్ లేకుండా చేద్దాం..భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు చేస్తున్నారని కేటీఆర్ ఫైర్

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి