Director Madan No More: టాలీవుడ్ కి మరో షాక్.. ప్రముఖ దర్శకుడు మదన్ కన్నుమూత.. నాలుగు రోజుల కిందట బ్రెయిన్ స్ట్రోక్.. పరిస్థితి విషమించడంతో మృతి.. ‘ఆ నలుగురు’ చిత్రంతో రచయితగా గుర్తింపు
రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో అవార్డ్ విన్నింగ్ సినిమా ‘ఆ నలుగురు’ చిత్రంతో రచయితగా గుర్తింపు పొంది, ఆపై దర్శకుడిగా మారిన ప్రముఖ డైరెక్టర్ మదన్ కన్నుమూశారు.
Hyderabad, Nov 20: సూపర్ స్టార్ కృష్ణ (Krishna) మరణంతో శోక సంద్రంలో మునిగిపోయిన టాలీవుడ్ (Tollywood)కి మరో షాక్. రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) ప్రధాన పాత్రలో అవార్డ్ విన్నింగ్ సినిమా ‘ఆ నలుగురు’ చిత్రంతో రచయితగా గుర్తింపు పొంది, ఆపై దర్శకుడిగా మారిన ప్రముఖ డైరెక్టర్ మదన్ (Madan) కన్నుమూశారు. మదన్ కొన్నిరోజుల కిందట బ్రెయిన్ స్ట్రోక్ (Brain Stroke) కు గురయ్యారు. గత నాలుగు రోజులుగా ఆయన హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. మదన్ మృతితో టాలీవుడ్ లో విషాదం నెలకొంది.
మదన్ సొంతూరు చిత్తూరు జిల్లా మదనపల్లె. సినిమాలపై ఆసక్తితో రచయితగా ఎంట్రీ ఇచ్చారు. దర్శకుడిగా మారి తొలుత 'పెళ్లయిన కొత్తలో' చిత్రాన్ని తెరకెక్కించారు. కాఫీ విత్ మై వైఫ్, ప్రవరాఖ్యుడు, గరం, గుండె ఝల్లుమంది, గాయత్రి వంటి చిత్రాలకు దర్శకత్వం చేపట్టారు. మదన్ మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.