Mangaluru, NOV 20: కర్నాటక రాష్ట్రం మంగళూరులో (Mangaluru Blast) పేలుడు కలకలం రేగింది. ఓ ఆటో బాంబులా (Autorickshaw Explodes) పేలిపోయింది. బిజీ రోడ్డులో ప్రయాణిస్తున్న ఓ ఆటో సడెన్ గా పేలిపోయింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్, ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డారు. అకస్మాత్తుగా రోడ్డుపై ఇలా ఆటో పెద్ద శబ్దంతో పేలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఆటో పేలుడు మిస్టరీగా మారింది. ఆటో పేలుడుకు గల కారణాలు ఏంటో తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రజలు అనవసరంగా భయపడొద్దని పోలీసులు సూచించారు. ఈ పేలుడుకి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పేలుడుతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సిటీలో హైఅలర్ట్ ప్రకటించారు. టెర్రరిస్ట్ కోణంలో (Terror blast) ఈ ఘటనను చూస్తున్నారు. దీని వెనుక తీవ్రవాదుల హస్తం ఉందా అనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు.
Blast reported inside an auto rikshaw in #Mangaluru City, reportedly two people injured.
Investigations ON. pic.twitter.com/6yureZ5n7D
— Sumit Chaudhary (@SumitDefence) November 19, 2022
ఆటోలో కుక్కర్ బ్లాస్ట్ గా (Cooker Blast) పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద పేలుడుతో అలర్ట్ అయిన పోలీసులు మంగళూరులో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆటోలో పెద్ద సంఖ్యలో ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, పేలుడుకి ముందు ఆటో నుంచి మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆటోలో స్పార్క్ రావడాన్ని దాని డ్రైవర్ కూడా చూశాడు. కానీ, సమయానికి స్పందించలేకపోయాడు.
”మంగళూరు శివారులో కంకినాడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఆటోలో అనుమానాస్పద పేలుడు సంభవించింది. సాయంత్రం 5గంటల 15 నిమిషాలకు ఈ పేలుడు ఘటన చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్, అందులో ఉన్న ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలంలో కొంత మెటీరియల్ కలెక్ట్ చేశాం. కానీ, అది ఏంటి అన్నది ఇప్పుడే చెప్పలేము. ఫోరెన్సిక్ సిబ్బంది ఆ మెటీరియల్ ను ల్యాబ్ కి పంపారు. నివేదిక వస్తే కానీ స్పష్టత రాదు” అని మంగళూరు పోలీస్ కమిషనర్ శశికుమార్ తెలిపారు.
”పేలుడికి కారణం ఏంటో ఇంకా తెలియలేదు. పేలుడు ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. వారిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి ఏమీ చెప్పలేము. పేలుడికి ముందు ఆటోలో మంటలు రావడాన్ని గమనించినట్లు ఆటో డ్రైవర్ తెలిపాడు. చికిత్స అనంతరం గాయపడిన ఇద్దరితో మాట్లాడి మరిన్ని వివరాలు సేకరిస్తాం. ఈ ఘటనను ప్రజలు తమ మైండ్ నుంచి తీసేయండి. అనవసరంగా ఆందోళన చెందొద్దు. దయచేసి రూమర్స్ ను వ్యాపింపజేయొద్దు” అని సీపీ శశికుమార్ చెప్పారు.
కాగా, తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో సైతం ఇలాంటి పేలుడు ఒకటి కలకలం రేపింది. కారులో సిలిండర్ బ్లాస్ట్ అయ్యింది. పెద్ద శబ్బంతో కారు పేలిపోయింది. అక్టోబర్ 23న ఈ పేలుడు జరిగింది. ఈ పేలుడు వెనుక తీవ్రవాదుల హస్తం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బాంబు పేలుళ్లకు స్కెచ్ వేస్తుండగా.. కారులో సిలిండ్ బ్లాస్ జరిగిందని పోలీసులు వెల్లడించారు.