Ram Temple Inauguration: అయోధ్యకు చేరుకున్న అమితాబ్ బచ్చన్ కుటుంబం, రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొనన్ను బాలీవుడ్ స్టార్

వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.

Actors Amitabh Bachchan and Abhishek Bachchan at the Shri Ram Janmabhoomi Temple in Ayodhya

భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరగనుంది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై 1 గంటకు ముగియనుంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు అయోధ్యకు చేరుకుంటున్నారు. నటులు అమితాబ్ బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్ అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొనేందుకు అయోధ్యకు చేరుకున్నారు. వీడియో ఇదిగో, అయోధ్యకు చేరుకున్న చిరంజీవి, రాంచరణ్, బటలుదేరేముందు అభిమానులను కలిసిన తండ్రీకొడుకులు

నటుడు వివేక్ ఒబెరాయ్ మరియు గాయకుడు సోనూ నిగమ్ అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి ప్రాణప్రతిష్ఠ వేడుకకు హాజరయ్యారు. వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ, "ఇది మాయాజాలం, అద్భుతమైనది. నేను దాని చిత్రాలను చాలా చూశాను. కానీ మీరు మీ కళ్ళ ముందు చూస్తుంటే, మీరు ఏదో మ్యాజిక్ చూస్తున్నట్లు అనిపిస్తుందని అన్నారు.

Here;s Videos



సంబంధిత వార్తలు