అయోధ్యలో నేడు (జనవరి 22) రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుండగా, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లకు కూడా ఆహ్వానం అందిన సంగతి విదితమే.ఈ నేపథ్యంలో తెలుగు సూపర్ స్టార్లు చిరంజీవి, రామ్ చరణ్ అయోధ్య విమానాశ్రయానికి చేరుకున్నారు.వారు హైదరాబాద్ నుంచి బయలు దేరేముందు అభిమానులను కలిశారు. అభిమానుల ఉత్సాహాన్ని చూసి చిరంజీవి, రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అభిమానులు చిరంజీవి, రామ్ చరణ్ లకు శ్రీరామ ప్రతిమను బహూకరించారు. పలువురు అభిమానులు రక్తదానం కూడా చేశారు.

అంతకుముందు, చిరంజీవి తనకు అయోధ్య నుంచి ఆహ్వానం అందిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇది ఆ దేవుడు పంపిన ఆహ్వానంగా భావిస్తానని తెలిపారు. "ఆ అంజనాదేవి పుత్రుడు 'చిరంజీవి' హనుమంతుడు... భువిపై ఉన్న ఈ అంజనాదేవి పుత్రుడు చిరంజీవికి పంపిన ఆహ్వానం" అంటూ అభివర్ణించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)