Veera Simha Reddy: దుమ్మురేపుతున్న బాలయ్య మూవీ ప్రీ బిజినెస్, లెక్కలు చూస్తే కళ్లు తిరగాల్సిందే, ఎక్కడెక్కడ ఎంత ప్రీ బిజినెస్ జరిగిందో తెలుసా?

ఈ మూవీ నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్ రూ. 13 కోట్లు, ఆంధ్రాలో రూ.35 కోట్లు, రెస్టాఫ్ ఇండియా లో రూ. 6 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 6 కోట్ల బిజినెస్ చేసింది. ఓవరాల్ వరల్డ్‌వైడ్ గా రూ. 75 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

Veera Simha Reddy (Photo-Twitter/Mythri Movie)

Hyderabad, JAN 12:  నందమూరి బాలకృష్ణ (Nandamuri balakrishna) నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand malineni) తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ బిజినెస్ (Pre release business) వివరాలు చూస్తే బాలయ్య కెరీర్‌లో ఈ సినిమా కూడా మరో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవనుందని తెలుస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.75 కోట్ల మేర ప్రీరిలీజ బిజినెస్ జరిపింది. ఓ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీకి ఇది చాలా మంచి ప్రీరిలీజ్ బిజినెస్ అని చెప్పాలి.

RRR in Chinese Theaters: చైనాలో తెలుగు సినిమా ఊపు, నాటు నాటు సాంగ్ పాటకు థియేటర్లో స్క్రీన్ ముందుకు వచ్చి డ్యాన్సులేసిన చైనీయులు 

అయితే సంక్రాంతి సీజన్ కావడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా కాన్ఫిడెంట్‌గా ఉండటంతోనే ఈ మేరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఏరియాల వారీగా ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ మూవీ నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్ రూ. 13 కోట్లు, ఆంధ్రాలో  రూ.35 కోట్లు, రెస్టాఫ్ ఇండియా లో రూ. 6 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 6 కోట్ల బిజినెస్ చేసింది. ఓవరాల్ వరల్డ్‌వైడ్ గా రూ. 75 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.



సంబంధిత వార్తలు

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

Allu Arjun on Sandhya Theater Row: అందుకే శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌లేదు, నేను ఆ రోజు అస్స‌లు రోడ్ షో చేయ‌లేదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన అల్లు అర్జున్

CM Revanth Reddy: రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా?, ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై క్లారిటీ

KTR On Rythu Bharosa: రుణమాఫీపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే క్లారిటీ లేదు, 100 శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా...ప్రభుత్వానికి సవాల్ విసిరిన కేటీఆర్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif