Venkatesh About Ramanaidu: నాన్న చివరి కోరిక తీర్చ‌లేక పోయా! అన్ స్టాప‌బుల్ షోలో ఎమోష‌న‌ల్ అయిన విక్ట‌రీ వెంక‌టేష్..ఇంకా ఏమ‌న్నారంటే?

ఆయన వల్లే మేము ఇక్కడ ఉన్నాం. ఆయన జీవితం అంతా సినిమాలకే ఇచ్చారు. ఫ్యామిలీని, వర్క్ ని సరిగ్గా బ్యాలెన్స్ చేసారు. చివరి క్షణాల్లో కూడా సినిమా స్క్రిప్ట్ చదివేవాళ్ళు. ఒక స్క్రిప్ట్ నచ్చి నాకు చెప్పారు ఈ సినిమా చేస్తే బాగుంటుంది అని. ఆ కథలో నాతో కలిసి నటిద్దాం అనుకున్నారు. కానీ అప్పుడు ఆయన అనారోగ్యంగా ఉన్నారు. దాంతో ఆ సినిమా చేయడం కుదరలేదు

Venkatesh About Ramanaidu (PIC @ Aha X)

Hyderabad, DEC 27: ఆహా ఓటీటీలో బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి (Unstoppable Show) తాజాగా వెంకటేష్ వచ్చి సందడి చేసాడు. ఈ ఎపిసోడ్ ని ఆహా ఓటీటీలో ఇవాళే రిలీజ్ చేశారు. ఈ స్టార్ హీరోలు కలిసి షోలో మాట్లాడుకోవడంతో ఫ్యాన్స్, సినిమా లవర్స్ ఈ ఎపిసోడ్ ని చూస్తూ వైరల్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ (BalaKrishna) అనేక ప్రశ్నలు అడగ్గా వెంకటేష్ (Venkatesh) ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ ఎపిసోడ్ కి వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబు(Suresh Babu) కూడా వచ్చారు. ఈ క్రమంలో వీరి నాన్న లెజండరీ నిర్మాత దివంగత రామానాయుడు (RamaNaidu) గురించి అడిగారు. దీంతో సురేష్ బాబు, వెంకటేష్ వాళ్ళ నాన్న చివరి రోజుల గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు.

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్..నూతన సంవత్సరం కానుకగా పవన్ పాడిన పాట రిలీజ్ చేయనున్న హరిహర వీరమల్లు మేకర్స్! 

వెంకటేష్ మాట్లాడుతూ.. ఆయన వల్లే మేము ఇక్కడ ఉన్నాం. ఆయన జీవితం అంతా సినిమాలకే ఇచ్చారు. ఫ్యామిలీని, వర్క్ ని సరిగ్గా బ్యాలెన్స్ చేసారు. చివరి క్షణాల్లో కూడా సినిమా స్క్రిప్ట్ చదివేవాళ్ళు. ఒక స్క్రిప్ట్ నచ్చి నాకు చెప్పారు ఈ సినిమా చేస్తే బాగుంటుంది అని. ఆ కథలో నాతో కలిసి నటిద్దాం అనుకున్నారు. కానీ అప్పుడు ఆయన అనారోగ్యంగా ఉన్నారు. దాంతో ఆ సినిమా చేయడం కుదరలేదు. తర్వాత చాలా బాధపడ్డాను ఆయన కోసం ఆ సినిమా చేసి ఉంటే బాగుండు అని. చివరి రోజుల్లో కూడా ఆయన సినిమా కోసమే బతికారు అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు.

Venkatesh And Suresh Babu Got Emotional While Remembering Their Father

 

ఇక సురేష్ బాబు మాట్లాడుతూ.. నాన్న అనుకున్నవి కొన్ని చేయలేకపోయాము. నాన్న ఎప్పట్నుంచో కృషి విజ్ఞాన కేంద్రం పెట్టాలనుకున్నారు. ఆయన పోయాక ఒక పొలాన్ని ఇచ్చేసి దాంట్లో ఏకలవ్య కృషి విజ్ఞాన్ కేంద్రం పెట్టాను. అలాంటి కోరికలు తీర్చగలిగాను. కానీ నాన్న రెండు విషయాల్లో మాత్రం బాధపడ్డారు. నాన్న మంచి చేసినా ఎంపీగా ఓడిపోయాను అని బాధపడ్డారు. వెంకీతో సినిమా చేయలేదని బాధపడ్డారు అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు.

అలాగే.. నాన్న వెళ్ళిపోయాక అన్నయ్యే అన్ని బాధ్యతలు తీసుకున్నారు. ఒక పిల్లర్ లాగా మా ఫ్యామిలీ కోసం నిలబడ్డారు. అన్నయ్య ఉండటం బట్టే ఇవాళ మేము ఇలా ఉన్నాము అని వెంకటేష్ చెప్పారు. ఇలా ఇద్దరు అన్నదమ్ములు తమ తండ్రి రామానాయుడుని తలుచుకొని ఎమోషనల్ అవ్వడం, ఎప్పుడూ సరదాగా ఉండే వెంకటేష్ మొదటిసారి బయట ఎమోషనల్ అవ్వడంతో ఈ ఎపిసోడ్ మరింత వైరల్ అవుతుంది

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now