
Vijayawada, FEB 16: కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధానమైన హామీలలో అన్నదాత సుఖీభవ (Annadata Sukhibhava Scheme) ఒకటి. ఈ హామీ అమలు దిశగా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. రైతులను దృష్టిలో పెట్టుకుని కూటమి సర్కార్ ఈ స్కీమ్ కు రూపకల్పన చేసింది. అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20వేలు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. అన్నదాతలకు పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం (PM Kisan) కింద రూ.6వేలు ఇస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మరో 14 వేలు కలిపి ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయంగా అందిస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ ఆర్థిక సాయాన్ని మూడు విడతలుగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
అన్నదాత సుఖీభవ స్కీమ్ కి (Annadata Sukhibhava Scheme) సంబంధించి మంత్రి నిమ్మల రామానాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. రైతులకు రూ.20వేలు ఇచ్చేది ఎప్పుడో ఆయన చెప్పేశారు. అన్నదాత సుఖీభవ పథకం అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నిమ్మల. మే నెలలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ.20 వేలు అందిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందన్నారు.
పీఎం కిసాన్ స్కీమ్ లో అన్నదాతలకు పెట్టుబడి సాయంగా ఏడాదికి మూడు విడతల్లో రూ.6 వేలు ఇస్తోంది కేంద్రం. పీఎం కిసాన్ నిధులతో కలిపి రూ.20 వేలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
త్వరలోనే అన్నదాత సుఖీభవ విధి విధానాలను ఖరారు చేసి పథకాన్ని అమలు చేయాలని కూటమి సర్కార్ భావిస్తోంది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తాంది. అర్హత ఉన్న ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు అందనున్నాయి. అన్నదాత సుఖీభవ పథకం కింద పీఎం కిసాన్ నిధులు రూ.6 వేలకు మరో 14 వేలు కలిపి రూ.20 వేలు అందించనున్నారు.
పాలకొల్లులో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయాన్ని కోరుతూ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రచారం చేశారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి కూటమి అభ్యర్థిని గెలిపించాల్సిందిగా గ్రాడ్యుయేట్లను కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు మంత్రి నిమ్మల రామానాయుడు.