Hyd, December 27: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ప్రస్తుతం రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండగా ఎన్నికలకు ముందు కమిట్‌మెంట్ ఇచ్చిన సినిమా షూటింగ్‌లను సమయం దొరికినప్పుడల్లా పూర్తి చేస్తున్నారు పవన్.
ఇందులో భాగంగా పవన్ కెరీర్‌లో తెరకెక్కుతున్న తొలి పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోండగా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. వీడియో ఇదిగో, ఆయన ఇగో వల్ల టాలీవుడ్ అంతా సీఎం ముందు తలవంచాల్సి వచ్చింది, సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నూతన సంవత్సరం కానుకగా సినిమా నుండి పాటను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. పవన్ స్వయంగా పాడిన ఈ పాట జనవరి 1న 12 గంటలకు ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేయనున్నారు.
Hari Hara Veera Mallu First Song Update
Hari Hara Veera Mallu
1⃣st single - Jan 1st 1⃣2⃣ AM✅
Vocals - Pawan Kalyan🎙️ pic.twitter.com/2LNC9GR6GG
— Manobala Vijayabalan (@ManobalaV) December 26, 2024
ఈ క్రేజీ ప్రాజెక్టులో అనుపమ్ ఖేర్, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ లు కీలక పాత్రల్లో కనిపించనుండగా కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. రెండు పార్టులుగా రానున్న ఈ చిత్రం ఫస్ట్ పార్టు మార్చి 28న విడుదల కానుంది.