RRR OTT Release Date And Time: ఓటీటీలో RRR మూవీ ఎప్పుడో తెలుసా? క్రేజీ మూవీ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న సంస్థలు ఇవే! ఓటీటీలో త్రిపుల్ ఆర్ చూడాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే
మరి ఓటీటీ (OTT)సంగతేంటి? అవును త్రిపుల్ ఆర్ మూవీ ఓటీటీ రిలీజ్ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ మూవీని దక్కించుకునేందుకు ఓటీటీ సంస్థలు ఎగబడ్డాయి. అయితే చివరకు జీ 5 (Zee 5), నెట్ ఫ్లిక్స్ (Netflix) ఈ మూవీని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Hyderabad, March 25: భారీ అంచనాలతో రిలీజైన త్రిపుల్ ఆర్ మూవీ (RRR Movie)...అదే రేంజ్ లో హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఫ్యాన్స్ కూడా అదేస్థాయిలో మూవీని ఎగబడి చూస్తున్నారు. అయితే మూవీ థియేటర్లలో రిలీజైపోయింది. మరి ఓటీటీ (OTT)సంగతేంటి? అవును త్రిపుల్ ఆర్ మూవీ ఓటీటీ రిలీజ్ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ మూవీని దక్కించుకునేందుకు ఓటీటీ సంస్థలు ఎగబడ్డాయి. అయితే చివరకు జీ 5 (Zee 5), నెట్ ఫ్లిక్స్ (Netflix) ఈ మూవీని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఆర్ఆర్ఆర్ సినిమా నెట్‌ఫ్లిక్స్, జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో విడుదలయ్యే అవకాశం ఉందని వినిపించింది. ఇప్పుడు వాటికే డిజిటల్ రైట్స్ (Digital Rights)దక్కినట్లు తెలుస్తుంది.
సౌత్ లాంగ్వేజెస్ వరకు జీ 5లో స్ట్రీమింగ్ కాబోతుంటే, హిందీతోపాటు ఇతర భాషలైన ఇంగ్లీష్, పోర్చుగల్, కొరియన్, టర్కీష్, స్పానిష్ భాషలు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నారట. ఇక, సినిమా విడుదలయ్యాక 90 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేయాలనే కండీషన్ కూడా పెట్టుకున్నట్టు సమాచారం. ఈ లెక్కన చూస్తే జూన్‌లో సినిమా ఓటీటీలోకి రానుంది. దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాల్సి ఉంది.
అటు త్రిపుల్ ఆర్ మూవీ ఫస్ట్ డే కలక్షన్స్ దుమ్మురేపాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల తొలిరోజు కలెక్షన్స్ సాధించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ భారీ మూవీకోసం ఫ్యాన్స్ నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ కూడా అయిపోయింది. అయితే ఓటీటీ రిలీజ్(OTT Release) కోసం మాత్రం మరో మూడు నెలలు వేయిట్ చేయాల్సి వచ్చే అవకాశముంది. దీనిపై అధికారికంగా ధృవీకరణ రాలేదు. కానీ సినీవర్గాలు మాత్రం ఓటీటీ గురించి చర్చలు అయిపోయాయంటున్నాయి.