పేటీఎమ్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త తెలిపింది. రూ.1కే ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ పొందవచ్చు అని పేటీఎమ్ తన ట్విటర్ వేదికగా తెలిపింది. ఇందుకోసం ప్రేక్షకులు, అభిమానులు పేటీఎమ్ యాప్ ద్వారా పేటీఎమ్ జెనీ మొబైల్ నంబర్‌‌కి ₹1 పంపిస్తే ₹150 వరకు విలువైన ఆర్ఆర్ఆర్ మూవీ వోచర్ పొందవచ్చు. ఇంకా, మరో విషయం ఏమిటంటే మీరు పేటీఎమ్ జెనీకి పంపిన ₹1ని కూడా తిరిగి మీ ఖాతాలో రీఫండ్ చేయనున్నట్లు తెలిపింది. అంటే, ఉచితంగా ఈ ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ పొందవచ్చు. అయితే, ఈ ఆఫర్ మార్చి 24 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)