Bigg Boss 3 Final Stage: ముగింపుకు వచ్చిన బిగ్‌బాస్ 3, ఫైనల్‌కు చేరుకున్న రాహుల్, బాబా భాస్కర్, శ్రీముఖి, మరొకరు ఎవరనేది సస్పెన్స్, వచ్చే ఆదివారం ఫైనల్ విజేత ఎవరనేది తెలుస్తుంది

నాగార్జున వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో వ‌చ్చే ఆదివారంతో పూర్తిగా ముగియ‌నుంది. వ‌చ్చే ఆదివారం ఫైన‌ల్ విజేత ఎవ‌రో తెలుతుంది. ఇప్ప‌టికే ఫైనల్స్‌కు రాహుల్ సిప్లిగంజ్‌, కొరియోగ్రాఫ‌ర్ బాబా భాస్క‌ర్ రీచ్ అయ్యారు. కాగా శ‌నివారం శ్రీముఖి ఫైన‌ల్స్‌కు వెళుతున్న‌ట్లు నాగార్జున తెలియ‌జేశారు.

bigg-boss-3-telugu-this-week-shiva-jyothi-or-ali-reza-may-be-out I Photo- Star Maa Telugu

October 27: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 3 ముగింపు ద‌శ‌కు చేరుకుంది. నాగార్జున వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో వ‌చ్చే ఆదివారంతో పూర్తిగా ముగియ‌నుంది. వ‌చ్చే ఆదివారం ఫైన‌ల్ విజేత ఎవ‌రో తెలుతుంది. ఇప్ప‌టికే ఫైనల్స్‌కు రాహుల్ సిప్లిగంజ్‌, కొరియోగ్రాఫ‌ర్ బాబా భాస్క‌ర్ రీచ్ అయ్యారు. కాగా శ‌నివారం శ్రీముఖి ఫైన‌ల్స్‌కు వెళుతున్న‌ట్లు నాగార్జున తెలియ‌జేశారు. కాగా ఎలిమినేష‌న్‌కి వ‌రుణ్‌, శివ‌జ్యోతి, అలీరెజాలు ఉన్నారు. వీరిలో అలీ రెజా ఎలిమినేట్ అవుతున్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ రోజు సాయంత్రానికి ఓ క్లారిటీ రానుంది. కాగా ఈ ఎపిసోడ్ ఈ రోజుతో 14 వారాలు పూర్తి చేసుకోబోతుంది. ఈ మధ్య బిగ్‌ బాస్ హౌస్‌లో టాస్క్‌లు, సభ్యుల ఆటలు రసవత్తరంగా మారాయి. ఇదిలా ఉంటే ఈ షో కీలకమైన చివరి దశకు చేరుకోవడంతో బిగ్‌బాస్ కఠినమైన టాస్కులతో కంటెస్టెంట్స్‌కు పరీక్ష పెడుతున్నాడు.

ఎప్పటిలాగే ప్రతి ఆదివారం ఎలిమినేషన్‌ ప్రక్రియ జరుగుతూ వస్తోంది. ఈ ఆదివారం ఎలిమినేషన్‌‌లో నిన్నటి వరకు శివజ్యోతి పేరు వినిపించింది. తాజాగా హౌస్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన అలీ రెజాను ఈ వారం ఇంటి నుండి బయటకు వెళతాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఒకసారి బయటకు వెళ్లిన తర్వాత బయట పరిస్థితులు చూసి గేమ్ ఆడటం. గతంలో అలీ రెజాలో ఉన్న జోష్ ఇపుడు లేకపోవడం వలన అలీకి తక్కువ ఓట్లు వచ్చినట్టుగా వార్తలు వినబడుతున్నాయి. ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఈ రోజు తెలిసిపోతుంది.

ఇవి కూడా చదవండి

పునర్ణవి ఔట్ అవడంతో అందరూ సంతోషపడ్డారు

ఈసారి కొంపలో కుంపటి పెట్టబోయేది ఎవరు?

యాక్టింగ్ కాదు, అంతా రియాలిటీ

పూర్తిగా చంద్రముఖిలా మారిన శ్రీముఖి



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif