Big Boss 3: పూర్తిగా చంద్రముఖిలా మారిన శ్రీముఖి! బిగ్ బాస్ 3 హౌజ్‌లో పునర్నవి - రాహుల్ మధ్య ఖుషి మూవీ నడుము సీన్ రిపీట్. వినాయక చవితి సందర్భంగా ఎలిమినేషన్ లేదని చెప్పిన స్పెషల్ హోస్ట్ రమ్యకృష్ణ.
Ramya Krishna hosted Big Boss 3 Telugu episode highlights. | Photo - Star Maa.

Big Boss 3 ఈ వీకెండ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా, ఫుల్ జోష్ తో సాగింది. తన బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో కలిసి హోస్ట్ అక్కినేని నాగార్జున స్పెయిన్ లో ఉండటంతో.  బిగ్ బాస్ హౌజ్ మేట్స్ ని, టీవీ చూస్తున్న ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూ ఈ వీకెండ్ కి హోస్ట్ గా శివగామి రమ్యకృష్ణ స్పెషల్ ఎంట్రీ ఇచ్చింది. రమ్యకృష్ణ ఎంట్రీతో టీవిలో నిండుతనం వచ్చింది. నాగార్జున లేని లోటును పర్ ఫెక్ట్ గా ఫిల్ చేసింది రమ్యకృష్ణ. ఫీల్ కోసం నాగార్జున- రమ్యకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన పాటలను హౌజ్ లో ప్లే చేశారు.

శనివారం హౌజ్ లో ఉండే సభ్యుల్లో ఒకరిపై ఒకరికి నచ్చే అంశాలు, నచ్చని అంశాలు లాంటి టాపిక్ ఇచ్చారు. ఇక ఆదివారం రోజైతే మరింత ఎంటర్టైనింగ్ గా హౌజ్ మేట్స్ కి సినిమాలో సన్నివేశం టాస్క్ ఇచ్చి ఆ సీన్లలో నటించమని చెప్పారు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోని పూలకుండిని తన్నే సీన్ రవి, అలీలకు ఇచ్చారు. వెంకటేశ్ గా రవి యాక్ట్ చేయగా, మహేశ్ బాబుగా అలీ నటించారు. వీలిద్దరి బ్రొమాన్స్ చాలా బాగా పండింది.

వీరి పెర్ఫార్మెన్స్ కి మిగతా హౌజ్ మేట్స్ నుంచి 77 స్కోర్ లభించగా, హోస్ట్ రమ్యకృష్ణ 30/50 స్కోర్ ఇచ్చారు.

రంగస్థలం సినిమా సీన్లను చేయాల్సిందిగా మరో ముగ్గురు సభ్యులకు టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా రంగమత్తగా శివజ్యోతి , రామ్ చరణ్ గా, మహేశ్ మరియు సమంతగా హిమజ నటించారు.

వీరి పెర్ఫార్మెన్స్ కి మిగతా హౌజ్ మేట్స్ నుంచి 79 స్కోర్ లభించగా, హోస్ట్ రమ్యకృష్ణ 33/50 స్కోర్ ఇచ్చారు.

ఖుషి సినిమాలోని నడుము సన్నివేశాన్ని రాహుల్, పునర్నవిలకు ఇచ్చారు. లవర్స్ లాగా వీరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది.

ఆ నడుము సీన్ లో నటిస్తూ ఇద్దరు ఫైట్ చేసుకుంటుండగానే మధ్యలో "నీకు నా మీద నీకెలాంటి ఫీలింగ్స్ లేవా, నా మీద ప్రేమ లేదా నీకు?" అని రాహుల్ అడిగినపుడు పునర్నవి చూసిన చూపు నిజంగా అతడి పట్ల ఎంత ప్రేమ ఉందనేది ఆమె కళ్లలోనే చూపిచేసింది.

వీరి పెర్ఫార్మెన్స్ కి మిగతా హౌజ్ మేట్స్ నుంచి 80 స్కోర్ లభించగా, హోస్ట్ రమ్యకృష్ణ 40/50 స్కోర్ ఇచ్చారు.

F2 సినిమాలోని ఫ్రస్ట్రెటెడ్ మొగుడు, అగ్రెసివ్ భార్యలుగా వరుణ్ సందేశ్ మరియు వితికలకు టాస్క్ ఇచ్చారు. వీరు యాజ్ ఇట్ ఈజ్ గా ఆ సీన్ దించేశారు.

వీరి పెర్ఫార్మెన్స్ కి మిగతా హౌజ్ మేట్స్ నుంచి 79 స్కోర్ లభించగా, హోస్ట్ రమ్యకృష్ణ 45/50 స్కోర్ ఇచ్చారు.

ఇక ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చంద్రముఖి సీన్. రజినీకాంత్ గా బాబా మాస్టర్, చంద్రముఖిగా శ్రీముఖి నటించారు. శ్రీముఖికి హౌజ్ లో ఒక ఆభరణాల డబ్బ దొరికుతుంది. ఆ అభరణాలు చంద్రముఖి పూనిన జ్యోతికలాగా శ్రీముఖి పెట్టుకున్న తీరు, ఆ తర్వాత ఇద్దరు కలిసి చేసిన డాన్స్. పూర్తిగా చంద్రముఖిలా మారినట్టు శ్రీముఖి చేసిన పెర్ఫార్మెన్స్ కి అందరితో వావ్ అనిపించుకుంది. ఫుల్ ఎనర్జిటిక్ గా, ఎంటర్టైనింగ్ గా సాగింది వీరి పెర్ఫార్మెన్స్ .

వీరి పెర్ఫార్మెన్స్ కి మిగతా హౌజ్ మేట్స్ నుంచి 88 స్కోర్ లభించగా, హోస్ట్ రమ్యకృష్ణ 45/50 స్కోర్ ఇచ్చారు. హౌజ్ లో అందరికటే ఎక్కువ స్కోర్ సాధించి ఈ టాస్క్ లో విన్నర్ గా నిలిచింది ఈ జోడి.

అనంతరం బిగ్ బాస్ 3 హాజ్ ను రమ్యకృష్ణ వెళ్లి సందర్శించారు. హాజ్ మేట్స్ ను నేరుగా కలుసుకొని వారితో ఇళ్లంతా కలియతిరిగారు. వారితో మిగతా టైం స్పెండ్ చేశారు. హౌజ్ మేట్స్ అందరికీ బిగ్ బాస్ 3 టీషర్ట్స్ ఇచ్చి, ఒక్కొకరి టీషర్ట్ మీద వారికి సరిపోయే ట్యాగ్ లైన్ ఇచ్చారు. వాటిపై డిస్కషన్ జరిగింది.

ఇక చివరగా ఈ సారిఎవరి ఎలిమినేషన్ జరగలేదు. అందరూ వినాయక చవితి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పారు. వచ్చేవారం కింగ్ నాగార్జున తిరిగి బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటర్ అవుతారని, తనకు రావాలనిపించినపుడు మళ్లీ బిగ్ బాస్ హౌజ్ కు తప్పకుండా వస్తానని చెప్పి, హౌజ్ మేట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ రమ్యకృష్ణ వెళ్లిపోవడంతో ఈ వీకెండ్ బిగ్ బాస్ 3 ఎపిసోడ్ అక్కడ ముగిసింది.