Hyper Aadi: జబర్దస్త్‌‌లోకి మళ్లీ హైపర్ ఆది రీ ఎంట్రీ.., శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో కనిపించిన కమెడియన్, అసలు విషయం ఏంటీ అనేది ఇంకా సస్పెన్స్

దాంతో ఈటీవీకి హైపర్‌ ఆది గుడ్‌ బై చెప్పేశాడు అనే వార్తలు జోరుగా వస్తున్నాయి

Jabardasth comedian Hyper Aadi (Photo-Facebook)

కమెడియన్ హైపర్ ఆది జబర్దస్త్‌ తో దాదాపు అయిదు ఆరు సంవత్సరాలుగా ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేస్తున్నాడు.అయితే ఆయన (Hyper Aadi) ఈమద్య కాలంలో జబర్దస్త్ లో కనిపించడం లేదు. దాంతో ఈటీవీకి హైపర్‌ ఆది గుడ్‌ బై చెప్పేశాడు అనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఆమద్య శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఆద కనిపించలేదు. దాంతో మొత్తానికి మల్లెమారితో ఆది తెగ తెంపులు చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అసలు విషయం ఏంటీ అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో శ్రీదేవి డ్రామా కంపెనీలో (Sridevi Drama Company) ఆది రీ ఎంట్రీ ఇచ్చాడు.

శ్రీదేవి డ్రామా కంపెనీ లో కనిపించిన హైపర్ ఆది మళ్లీ జబర్దస్త్‌ లో (Jabardasth) కూడా వస్తాడేమో అనే ఆసక్తి అందరిలో పెంచాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో ఆదిని ఒక వ్యక్తి నీవు ఎందుకు జబర్దస్త్‌ లోకి రావడం లేదు చెప్పు.. అసలు ఎప్పుడు జబర్దస్త్‌ లో కనిపిస్తావు చెప్పు అంటూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నలకు సమాధానం ఆదివారం ప్రసారం కాబోతున్న శ్రీదేవి డ్రామా కంపెనీలో దొరికే అవకాశం ఉందని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఆదివారం ఎపిసోడ్‌ లో హైపర్ ఆది మునుపటి ఉత్సాహంతో ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేయబోతున్నాడు.ఆది మళ్లీ శ్రీదేవి డ్రామా కంపెనీలోకి వచ్చినంత మాత్రాన మళ్లీ జబర్దస్త్‌ లోకి వస్తాడు అని లేదు.

అవకాశం ఇస్తానంటూ చమ్మక్ చంద్ర నన్ను వాడుకుని వదిలేశాడు, సంచలన ఆరోపణలు చేసిన స్వాతి నాయుడు, ఈ వ్యాఖ్యలపై ఇంకా స్పందించని చంద్ర

అలా అని రాకపోవచ్చు అని లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటీ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీతో ఒప్పందం ఉండటం వల్ల హైపర్ ఆది వచ్చి ఉండవచ్చు.. అంతే తప్ప జబర్దస్త్‌ కు కూడా మళ్లీ వచ్చే అవకాశాలు లేవు అనేది కొందరి అభిప్రాయం. మరి కొందరు మాత్రం సినిమాల షూటింగ్ ల కారణంగా ఇన్నాళ్లు జబర్దస్త్‌ కు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు జబర్దస్త్‌ లో కూడా ఆది కనిపించే అవకాశం ఉంది అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం. అసలు విషయం ఏంటీ అనేది ఆ ఆది స్పందిస్తే కాని తెలియదు.