IPL Auction 2025 Live

Roja Quits Jabardasth Show: జబర్ధస్త్‌కు రోజా గుడ్‌బై, నూతన మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న నగరిఎమ్మెల్యే, వీ, సినిమా షూటింగ్‌లు ఇక చెయ్యనని తెలిపిన ఆర్కే రోజా

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మంత్రి అయినందుకు షూటింగ్‌లు మానేస్తున్నాను. టీవీ, సినిమా షూటింగ్‌లు ఇక చెయ్యను. ఇకపై జబర్దస్త్‌ షోలో (Roja Quits Jabardasth Show) పాల్గొనను’ అని రోజా ప్రకటించారు.

MLA Roja (Photo-Twitter)

Amaravati, April 11: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన మంత్రి వర్గంలో (Confirmation of Cabinet berth) నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మంత్రి అయినందుకు షూటింగ్‌లు మానేస్తున్నాను. టీవీ, సినిమా షూటింగ్‌లు ఇక చెయ్యను. ఇకపై జబర్దస్త్‌ షోలో (Roja Quits Jabardasth Show) పాల్గొనను’ అని రోజా ప్రకటించారు. కాగా, కొత్త, పాత కలయికగా 25 మందితో కూడిన కొత్త మంత్రి వర్గం కూర్పును సీఎం జగన్‌ ఫైనల్‌ చేశారు. 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్‌లో చోటు దక్కింది. నూతన కేబినెట్‌లో మొత్తం 25 మంది మంత్రులుండగా.. సీనియారిటీ పరంగా 11 మంది మంత్రులను కొనసాగించారు. కొత్తగా మరో 14 మందికి అవకాశం కల్పించారు. మంత్రులుగా సోమవారం వీరంతా ప్రమాణ స్వీకారం చేస్తారు.

ప్రాణం ఉన్నంతవరకు సీఎం జగనన్నతోనే ఉంటానని, ఆయన కోసమే పనిచేస్తానని ఎమ్మెల్యే ఆర్కే రోజా (MLA Roja) అన్నారు. నూతన మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న సీఎం జగన్ ఇచ్చిన గుర్తింపు ఎప్పటికి మర్చిపోలేను. నన్ను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని చంద్రబాబు అన్నారు.

నేడు కొత్త మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం, 14 మంది కొత్త ముఖాలకు వైఎస్ జగన్ మంత్రి వర్గంలో చోటు, 11 మంది సీనియర్లకు మరోసారి అవకాశం, మొత్తం 25 మందితో మంత్రి వర్గం ఏర్పాటు

కానీ జగనన్న నాకు రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రిగా అవకాశం ఇచ్చారు. మహిళా పక్షపాత సీఎం క్యాబినెట్‌లో మహిళ మంత్రిగా చోటు దక్కడం నా అదృష్టం. సీఎం జగనన్న చెప్పిన పని చెయ్యడమే నా విధి. నన్ను ఐరన్ లెగ్ అని దుష్ప్రచారం చేశారు. కానీ ఈ రోజు జగనన్న మంత్రిగా చేశారు. నా ప్రాణం ఉన్నంత వరకు జగనన్న కోసం పనిచేస్తానని తెలిపారు.