Unstoppable 2 Prabhas Episode Promo: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్, అన్‌స్టాపబుల్ -2లో బాలయ్యతో కలిసి రచ్చ చేసిన బాహుబలి స్టార్, మోస్ట్ వెయింటింగ్ ప్రోమో రిలీజ్
ఏమీ లేవన్నట్లుగా పాస్ బటన్ నొక్కాడు. అయితే బాలయ్య కాలంలో ఎలాంటి గోల, ఇబ్బందులు లేవని.. తాము ఎంత సైలెంట్‌గా ఉన్నా, ఏదో ఒక వార్త వస్తూనే ఉందని ప్రభాస్ అన్నాడు. ఇక రామ్ చరణ్‌తో బాలయ్య ఫోన్‌లో ప్రభాస్‌కు సంబంధించి ఏదో విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.
Hyderabad, DEC 17: నందమూరి బాలకృష్ణ (Balakrishna) హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్-2’ (Unstoppable 2) టాక్ షోకు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో మనం చూస్తున్నాం. ఈ షోను బాలయ్య హోస్ట్ చేస్తున్న తీరు, గెస్టులతో ఆయన చేస్తున్న సందడి ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. అయితే అన్‌స్టాపబుల్-2 లేటెస్ట్ ఎపిసోడ్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) కలిసి వస్తున్నట్లుగా షో నిర్వాహకులు ఇప్పటికే కొన్ని ప్రోమో గ్లింప్స్ వీడియోల్లో చూపెట్టారు. తాజాగా ఈ బిగ్గెస్ట్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఆహా రిలీజ్ చేసింది. ఈ ప్రోమో ఆద్యంతం ఫుల్ ఎనర్జీతో సాగింది. ఇటీవల ప్రభాస్ (Prabhas) ఇంట విషాదం నెలకొనగా, ఆయన్ను తిరిగి ఇలా నవ్వుతూ చూడటంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్యతో ప్రభాస్ చేసిన రచ్చ మామూలుగా లేదు. బాలయ్య ‘ఇటీవల శర్వానంద్ ఈ షోకి వచ్చినప్పుడు పెళ్లి ఎప్పుడు అంటే, ప్రభాస్ చేసుకున్న తరువాత అన్నాడు.. మరి నీ పెళ్లి ఎప్పుడు’’ (Prabhas Marriage) అని అడగ్గా.. ‘‘సల్మాన్ ఖాన్ చేసుకున్న తరువాత అని చెప్పాల్సి వస్తుందేమో’’ అంటూ ప్రభాస్ సరదాగా చెప్పుకొచ్చాడు.
ప్రభాస్ లైఫ్‌లో మోస్ట్ రొమాంటిక్ సీన్ ఏమిటి అని బాలయ్య అడగ్గా.. ఏమీ లేవన్నట్లుగా పాస్ బటన్ నొక్కాడు. అయితే బాలయ్య కాలంలో ఎలాంటి గోల, ఇబ్బందులు లేవని.. తాము ఎంత సైలెంట్‌గా ఉన్నా, ఏదో ఒక వార్త వస్తూనే ఉందని ప్రభాస్ అన్నాడు. ఇక రామ్ చరణ్‌తో బాలయ్య ఫోన్‌లో ప్రభాస్‌కు సంబంధించి ఏదో విషయాన్ని అడిగి తెలుసుకుంటుండగా..‘‘ఒరేయ్ చరణ్.. నువ్వు నా ఫ్రెండా, శత్రువా’’ అంటూ ప్రభాస్ ఫ్రస్ట్రేట్ అయ్యాడు.
RGV On Avatar-2: అవతార్-2 సినిమా కాదు.... ఒక జీవితకాలపు అనుభూతి: వర్మ
ఇక మ్యాచో స్టార్ గోపీచంద్ రావడంతో, చరణ్ ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ అంట.. అతనొక క్లూ ఇచ్చాడు.. అని బాలయ్య చెప్పగా.. రాణి గురించే కదా సార్.. అంటూ గోపీచంద్ అసలు మ్యాటర్ చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక గోపీచంద్ తనకు తొలి సినిమా ఇచ్చిన చేదు అనుభవంతో బౌన్స్‌బ్యాక్ అయ్యి ప్రస్తుతం ఉన్న స్థాయికి చేరుకున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలో గోపీచంద్‌తో కలిసి ప్రభాస్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను బాలయ్యతో షేర్ చేసుకున్నారు.
కాగా, దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజుని (Krishnam raju) తలుచుకుని ప్రభాస్ ఎమోషనల్ అయ్యాడు. అన్‌స్టాపబుల్-2 షో వేదికపై ఆయనకు నివాళి అర్పించిన సీన్ మనకు చూపెట్టారు. మొత్తంగా చూస్తే, ఈ టాక్ షోతో మళ్లీ పాత ప్రభాస్‌ను చూశామని అభిమానులు ఫీల్ అవుతున్నారు. కాగా ఈ ఎపిసోడ్‌ను డిసెంబర్ 30న ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.