Road Accident in Rajasthan: రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం.. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు
ఈ ఘటనలో 12 మంది మృత్యువాత పడ్డారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు.
Newdelhi, Oct 20: రాజస్థాన్ (Rajasthan) లోని ధోల్‌పూర్ జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృత్యువాత పడ్డారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 8 మంది చిన్నారులు ఉన్నారు. టెంపోను స్లీపర్ బస్సు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
వేడుకకు వెళ్లి తిరిగొస్తూ..
బారీ నగరంలోని కరీం కాలనీ గుమర్ మొహల్లాకు చెందిన నహ్నూ, జహీర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం బరౌలీ గ్రామంలో ఓ వేడుకకు హాజయ్యారు. అనంతరం టెంపోలో రాత్రి తిరుగు ప్రయాణం అయ్యారు. సునిపూర్ గ్రామ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న టెంపోను ఎదురుగా అతి వేగంగా వచ్చిన స్లీపర్ బస్సు ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం జరిగింది.
ఢిల్లీ సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద పేలుడు.. పోలీసులు అప్రమత్తం (వీడియోతో)