Satyapal Malik Lashes Out At Centre: కేంద్రాన్ని మళ్లీ టార్గెట్ చేసిన మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్.. 2019 నాటి ఎన్నికలు భారత సైనికుల శవాలపై పోరాటమని వ్యాఖ్య.. ఇంకా ఏమన్నారంటే??

పుల్వామా ఉగ్రదాడిని మరోమారు గుర్తు చేసిన ఆయన.. 2019 నాటి ఎన్నికలు భారత సైనికుల శవాలపై పోరాటమేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Satya Pal Malik. (Photo Credits: Instagram)

Newdelhi, May 22: జమ్ముకశ్మీర్ (Jammukashmir) మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Satyapal Malik) మరోసారి కేంద్ర ప్రభుత్వంపై (Central Government) విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. పుల్వామా (Pulwama) ఉగ్రదాడిని మరోమారు గుర్తు చేసిన ఆయన.. 2019 నాటి ఎన్నికలు భారత సైనికుల శవాలపై పోరాటమేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల పోరు సైనికుల శవాలపై జరిగిందన్న మాలిక్ ఈ ఘటనపై ఎలాంటి దర్యాప్తు జరగలేదని చెప్పారు. విచారణ జరిగి ఉంటే అప్పటి హోం మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చేదని పేర్కొన్నారు. అనేక మంది అధికారులు జైలు పాలయ్యే వారని, ఈ ఉదంతం పెద్ద వివాదాస్పదం అయ్యేదని తెలిపారు.

Rains In Hyderabad: తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం.. నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో భారీ వర్షం.. మరో రెండు మూడు గంటల్లో భారీ వర్షానికి అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. వీడియోతో

ఇంకా ఆయన ఏమన్నారంటే?

‘ఉగ్రదాడి జరిగిన రోజున ప్రధాని మోదీ జిమ్‌కార్బెట్ నేషనల్ పార్కులో షూటింగ్‌లో ఉన్నారు. ఆయన పార్కు నుంచి బయటకు రాగానే నేను ఫోన్ చేశాను. మన పొరపాటు వల్ల సైనికులు మరణించారని చెప్పాను. దీంతో, ఆయన నాకు మౌనంగా ఉండమని చెప్పారు’ అని సత్యపాల్ మాలిక్ వెల్లడించారు.

Dreaming Temple: నిద్రపోయినప్పుడు కలలో దేవాలయం కనిపించిందా..అయితే మీ జీవితంలో ఏం జరగబోతోందో వెంటనే తెలుసుకోండి..