India

Diabetic Kidney Disease: మధుమేహ రోగుల్లో కిడ్నీ వ్యాధిని ముందుగానే గుర్తించే మార్గం, ఐఐటీ బాంబే శాస్త్రవేత్తల నూతన పరిశోధన, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో అధ్యయనం

Team Latestly

మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో సాధారణంగా కలిగే తీవ్రమైన సమస్యల్లో ఒకటి మూత్రపిండాల వైఫల్యం (Kidney Failure). ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి నివారించే మార్గం ఇప్పుడు శాస్త్రవేత్తల దృష్టికి వచ్చింది. తాజాగా ఐఐటీ బాంబే (IIT Bombay) పరిశోధక బృందం చేసిన పరిశోధనలో డయాబెటిస్ ఉన్న వ్యక్తుల రక్తంలో ఉన్న బయోమార్కర్లు ద్వారా భవిష్యత్తులో వారికి మూత్రపిండ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేయవచ్చని తేలింది.

Karnataka Road Accident: దైవ దర్శనానికి వెళ్ళి తిరిగిరాని లోకాలకు, కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, దైవ యాత్రకు వెళ్లి ఒకే గ్రామానికి చెందిన నలుగురు తెలంగాణ వాసులు మృతి

Team Latestly

కర్ణాటక రాష్ట్రంలోని హల్లిఖేడ్ వద్ద జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో తెలంగాణ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి తల్లిని తోసేసిన సీఐ, బిడ్డ మృతి చెందాడని కాలేజీ యజమాన్యాన్ని ప్రశ్నించేందుకు వస్తే ఇలా చేస్తారా అని మండిపాటు

Team Latestly

చిత్తూరు సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థి రుద్ర కాలేజీ థర్డ్ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్పిటల్ కు తరలించే లోపు మృతి చెందాడు. సరిగ్గా నాలుగు రోజులక్రితం ఇదే కాలేజీలో నందిని రెడ్డి అనే విద్యార్ధిని కాలేజీ సెకండ్ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది.

PAN Aadhaar Linking: పాన్ కార్డుదారులకు చివరి హెచ్చరిక.. ఈ తేదీలోగా ఆధార్‌తో లింక్ చేయండి, లేదంటే బ్యాంకింగ్ సేవలు అన్నీ నిలిచిపోయే ప్రమాదం, ఇతర ఆదాయాలపై వడ్డీ కట్

Team Latestly

దేశవ్యాప్తంగా కోట్లాది మంది పాన్ కార్డుదారులకు ఇది అత్యంత కీలకమైన హెచ్చరికను జారి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికీ మీ పర్మినెంట్ అకౌంట్ నంబర్ (PAN)ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకుంటే నష్టపోతారని హెచ్చరించింది. వెంటనే అప్రమత్తం అవ్వాలని తెలిపింది.

Advertisement

Road Accident in Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, కారును ఢీకొట్టిన టిప్పర్..ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..

Team Latestly

నాగర్‌కర్నూల్ జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అచ్చంపేట మండలం చెన్నారం స్టేజ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అచ్చంపేట నుండి హైదరాబాద్‌ దిశగా వెళ్తున్న కారును ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ వేగంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన దెబ్బకు కారు రోడ్డుపై బోల్తాపడి పూర్తిగా ధ్వంసమైంది.

Chhattisgarh Train Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రైలు ప్రమాదం, గూడ్స్‌ రైలును ఢీకొట్టిన కోర్బా ప్యాసింజర్‌, ఇద్దరికి గాయాలు, వీడియో ఇదిగో..

Team Latestly

ఛత్తీస్‌గఢ్‌ (Chattishgarh)లోని బిలాస్‌పూర్‌ (Bilaspur)లో ఘోర రైలు ప్రమాదం (Train accident) చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న కోర్బా ప్యాసింజర్‌ రైలు.. జయరామ్‌ నగర్‌ స్టేషన్‌ వద్ద ఆగివున్న గూడ్స్‌ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు

Faridabad Shocker: వీడియో ఇదిగో, లైబ్రరీ నుండి తిరిగి వస్తున్న బాలికపై దుండగుడు కాల్పులు, హర్యానాలో నడిరోడ్డుపై దారుణ ఘటన

Team Latestly

హర్యానాలోని ఫరీదాబాద్ నగరంలో ఒక దుండగుడు నడిరోడ్డుపై 17 ఏళ్ల బాలికపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటన నగరంలోని ఒక ప్రైవేటు లైబ్రరీ వెలుపల చోటు చేసుకుంది. వీరిద్దరు నిత్యం ఆ లైబ్రరీకి వస్తున్నట్లు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను బట్టి తెలుస్తోంది.

Health Alert: ఈ 7 లక్షణాలు కనపడితే జాగ్రత్త, పురుషుల శరీరంలో క్యాన్సర్ ముదురుతున్న సంకేతాలు కావచ్చు, వెంటనే అలర్ట్ కాకుంటే ప్రాణాలకే ప్రమాదం

Team Latestly

మనలో చాలామంది క్యాన్సర్ అనేది కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే వస్తుందని భావిస్తారు. కానీ వైద్య పరిశోధనలు చెప్పే దాని ప్రకారం కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర లేకపోయినా, జీవనశైలి, వయస్సు, ఆహారపు అలవాట్లు, పర్యావరణ ప్రభావాలు వంటి అంశాలు భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.

Advertisement

Digital Arrest Scam Alert: ఆ కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తకండి, డిజిటల్ అరెస్ట్ స్కాంలపై ఎన్పీసీఐ హెచ్చరిక, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి ఫిర్యాదు చేయాలని వెల్లడి

Team Latestly

దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజా ప్రకటనతో ప్రజలకు ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో జరుగుతున్న కొత్త తరహా మోసాలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని NPCI స్పష్టం చేసింది.

India’s Hidden Health Crisis: భారత్‌లో భారీగా పెరుగుతున్న అంటువ్యాధులు, ఐసీఎంఆర్‌ నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి.. అలర్ట్ కాకుండా అంతే సంగతులిక..

Team Latestly

భారతదేశంలో అంటువ్యాధుల వ్యాప్తి క్రమంగా పెరుగుతున్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) తాజా నివేదిక స్పష్టం చేసింది. ప్రజారోగ్యానికి కీలకమైన వైరల్‌ ఇన్ఫెక్షన్లను గుర్తించే లక్ష్యంతో ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలోని వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ లాబొరేటరీస్ (VRDL) నెట్‌వర్క్‌ దేశవ్యాప్తంగా సేకరించిన నమూనాలపై విశ్లేషణ జరిపింది

Tamil Nadu Shocker: తమిళనాడులో దారుణం, కాలేజీ విద్యార్థినిని కిడ్నాప్‌ చేసి ముగ్గురు వ్యక్తులు, ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో లాక్కెళ్లి సామూహిక అత్యాచారం

Team Latestly

తమిళనాడులో దారుణ ఘటన వెలుగుచూసి కలకలం రేపింది. కేరళ సరిహద్దుకు సమీపంలోని కోయంబత్తూరులో ఓ ప్రైవేట్‌ కాలేజీలో పీజీ చదువుతున్న విద్యార్థినిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి ఆ యువతి తన స్నేహితుడితో కలిసి కారులో బయలుదేరింది.

ICC Women’s World Cup 2025: తొలిసారి వన్డే ప్రపంచకప్‌ కైవసం చేసుకున్న భారత్, దేవుని ప్రణాళిక అంటూ హృదయానికి హత్తుకునే పోస్ట్ పెట్టిన షఫాలీ వర్మ, అభినందనల వెల్లువ

Team Latestly

ఎప్పటినుంచో ఊరిస్తూ వస్తున్న వన్డే ప్రపంచకప్‌ ట్రోఫీ ఎట్టకేలకు భారత్‌ దరిచేరింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి టీమ్‌ఇండియా విశ్వవిజేతగా నిలిచింది. షెఫాలీవర్మ, దీప్తిశర్మ అర్ధసెంచరీలతో భారీ స్కోరు అందుకున్న భారత్‌..స్ఫూర్తిదాయక పోరాటంతో కదంతొక్కింది. లక్ష్యఛేదనలో సఫారీ కెప్టెన్‌ లారా వోల్వార్డ్‌ సెంచరీ పోరాటం సఫలం కాలేకపోయింది.

Advertisement

Jaipur Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, మద్యం మత్తులో రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనానాలను ఢీకొట్టుకుంటూ వెళ్లిన ట్రక్ డ్రైవర్,10 మంది మృతి, 50 మందికి గాయాలు

Team Latestly

రాజస్థాన్‌లోని జైపూర్‌లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ ట్రక్ డ్రైవర్ లోహమండి రోడ్‌పై ఆగి ఉన్న అనేక వాహనాలను బీభత్సంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

Chevella Bus Accident: టిప్పర్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడం వ‌ల్లే బస్సు ప్ర‌మాదం, చేవెళ్ల బస్సు ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి, 20 మంది మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు

Team Latestly

రంగారెడ్డి జిల్లాలో సోమవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చేవెళ్ల మండలం పీర్జాగూడ ఆర్టీసీ బస్సును కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్‌ లారీ ఢీ కొట్టి బస్సు మీద బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందారు. క్షతగాత్రులకు చికిత్స అందుతుండగా.. వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Kasibugga Stampede: కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొక్కిసలాట, తొమ్మదిమంది మృతి, మరికొందరికి గాయాలు,  ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు

Team Latestly

శ్రీకాకుళంలో(Srikakulam) జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో(Kashibugga Temple) తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో పది మందికి గాయపడినట్టు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కార్తీక మాసం నేపథ్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

Accident Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో..మూడేళ్ల పాప పైకి దూసుకెళ్లిన కారు, అయినా కూడా దెబ్బలు తగలకుండా కారు కింద నుండి మెల్లిగా బయటకు..

Team Latestly

అహ్మదాబాద్‌లోని నోబెల్‌నగర్ ప్రాంతంలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన సిసిటివిలో రికార్డైంది. ఇందులో ఒక టీనేజర్ నడుపుతున్న కారు ఢీకొట్టడంతో మూడేళ్ల బాలిక తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో, వేగంగా వస్తున్న నంబర్ ప్లేట్ లేని కారు ఆమెపైకి దూసుకెళ్లింది.

Advertisement

ICC Women's World Cup 2025: మూడోసారి ఫైనల్లోకి అడుగుపెట్టిన భారత మహిళలు, వన్డే ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన బ్లూ ఉమెన్స్, శతకంతో ఆసీస్ బౌలర్ల భరతం పట్టిన జెమీమా రోడ్రిగ్స్‌

Team Latestly

నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్టేడియంలో గురువారం రాత్రి భారత మహిళల జట్టు చరిత్ర రాసింది. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదిస్తూ, భారత మహిళలు మూడోసారి ఫైనల్లోకి అడుగుపెట్టారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాపై భారత్‌ 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.

India Winning Moment Video: భారత మహిళల విన్నింగ్ మూమెంట్ వీడియో ఇదిగో, అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత మహిళా క్రికెట్ జట్టు, ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 ఫైనల్లోకి..

Team Latestly

అక్టోబర్ 31న నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియాపై గెలిచి ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 ఫైనల్లోకి అడుగుపెట్టింది. ప్రేక్షకులతో కిటకిటలాడిన స్టేడియంలో ఆ రాత్రి భారత జట్టు ఆట ఒక మాయాజాలం లా మారింది.భారీ స్కోరు ఛేజ్ చేయాల్సిన పరిస్థితిలో కూడా భారత మహిళలు ధైర్యంగా పోరాడారు.

Prince Andrew: బ్రిటన్ రాజకుటుంబంలో లైంగిక ఆరోపణల కలకలం, ప్రిన్స్ ఆండ్రూపై కఠిన నిర్ణయం తీసుకున్న కింగ్ చార్ల్స్ III, రాచరిక బిరుదులన్నీ రద్దు, ప్యాలెస్ ఖాళీ చేయమని ఆదేశాలు

Team Latestly

బ్రిటన్ రాజకుటుంబంలో మరోసారి సంచలనం రేగింది. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో గత కొన్నేళ్లుగా వివాదాల్లో చిక్కుకున్న ప్రిన్స్ ఆండ్రూపై రాజు చార్ల్స్ III కఠిన నిర్ణయం తీసుకున్నారు. రాచరిక బిరుదులను రద్దు చేయడంతో పాటు, ఆయనకు విండ్సర్ ప్యాలెస్ పరిసర ప్రాంతంలో ఉన్న విలాసవంతమైన నివాసాన్ని కూడా ఖాళీ చేయమని ఆదేశించారు

Blood Pressure Variability: మీ బీపీ తరచూ మారుతుందంటే మెదడుకు పెను ముప్పు తప్పదు, తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి, చికిత్స విధానం ఏంటంటే..

Team Latestly

వయసు పైబడిన వారిలో రక్తపోటు (బీపీ) తరచూ హెచ్చుతగ్గులకు గురవుతుంటే.. అది మెదడు ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదమని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరిస్తోంది. సగటు రక్తపోటు సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ.. బీపీలో తరచుగా జరిగే స్వల్పకాలిక మార్పులు మెదడు కణాల పనితీరును దెబ్బతీసి, మెదడు పరిమాణం క్రమంగా తగ్గిపోవడానికి కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

Advertisement
Advertisement