Andhra Pradesh Horror: విజయవాడ నడిబొడ్డున దారుణం, ప్రేమను ఒప్పుకోలేదని ప్రియురాలి తండ్రిని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు, అక్కడికక్కడే మృతి

ఓ యువ‌కుడు తాను ప్రేమిస్తున్న ప్రియురాలి తండ్రిని అతి కిరాత‌కంగా క‌త్తితో పొడిచి చంపేశాడు. త‌న కూతురును ప్రేమిస్తున్న‌ట్లు తెలియ‌డంతో యువ‌కుడిని ఆమె తండ్రి మంద‌లించాడు.

Jilted Lover Kills Girlfriend's Father

ఆంధ్రప్రదేశ్‌లోని విజ‌య‌వాడ పరిధిలోని బృందావ‌న్ కాల‌నీలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ యువ‌కుడు తాను ప్రేమిస్తున్న ప్రియురాలి తండ్రిని అతి కిరాత‌కంగా క‌త్తితో పొడిచి చంపేశాడు. త‌న కూతురును ప్రేమిస్తున్న‌ట్లు తెలియ‌డంతో యువ‌కుడిని ఆమె తండ్రి మంద‌లించాడు. దీంతో స‌ద‌రు యువ‌కుడు ఇంత‌టి ఘాతుకానికి పాల్ప‌డిన‌ట్లు పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉండే ఓ వ్యాపారి కూతురు ఇంజినీరింగ్ ద్వితీయ సంవ‌త్స‌రం చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన శివ‌మ‌ణికంఠ ఓ స్కూల్‌లో పీఈటీగా ప‌ని చేస్తున్నాడు. యువ‌తితో మ‌ణికంఠ‌కు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారింది. దీంతో నాలుగేళ్లుగా ఇద్ద‌రు ప్రేమించుకుంటున్నారు. అత్తాపూర్‌లో దారుణం, టీ పెట్టలేదని కోడలిని చున్నీతో ఉరివేసి చంపేసిన అత్త, వీడియో ఇదిగో..

ఈ క్ర‌మంలో ఇటీవ‌ల యువ‌తి తండ్రి రామ‌చంద్ర ప్ర‌సాద్‌కు ఈ ప్రేమ విష‌యం తెలిసింది. దాంతో యువ‌కుడిని మందలించాడు. ఇక తండ్రికి ప్రేమ విష‌యం తెలియ‌డంతో యువ‌తి మ‌ణికంఠ‌ను దూరం పెట్టింది. ఇక ఇదే విష‌యమై యువ‌కుడి ఇంట్లో గొడ‌వ జ‌ర‌గ‌డంతో అత‌ని త‌ల్లి ఇల్లు వ‌దిలి వెళ్లిపోయింది. దీంతో మ‌ణికంఠ యువ‌తి తండ్రిపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా రామ‌చంద్ర ప్ర‌సాద్‌ను మ‌ట్టుబెట్టాల‌నుకున్నాడు.

Here's Video

స్థానికంగా కిరాణ‌షాపు నిర్వ‌హిస్తున్న రామ‌చంద్ర ప్ర‌సాద్ కూతురితో క‌లిసి రాత్రి 9 గంట‌ల ప్రాంతంలో తిరిగి ఇంటికి ప‌య‌న‌మ‌య్యాడు. అయితే, అప్ప‌టికే షాపున‌కు దగ్గ‌ర‌లో కాపుకాసిన మ‌ణికంఠ తండ్రీకూతుర్లు వెళ్తున్న బైక్‌ను త‌న వాహ‌నంతో ఢీకొట్టాడు. వారు కింద‌ప‌డిపోగా యువ‌తి తండ్రిపై క‌త్తితో విచ‌క్ష‌ణారహితంగా దాడికి పాల్ప‌డ్డాడు. అనంత‌రం అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు.

ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌డ‌ప‌డిన రామ‌చంద్ర ప్ర‌సాద్‌ను స్థానికులు ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు తెలిపారు.ఘటనపై కృష్ణ‌లంక‌ పోలీసులు కేసు న‌మోదు చేసి నిందితుడు మ‌ణికంఠ‌ను అదుపులోకి తీసుకున్నారు.