Cycle Down Down Slogan from TDP: సైకిల్ డౌన్ డౌన్ అంటున్న టీడీపీ నేతలు, ఇదేమి ఖర్మ అంటూ తలపట్టుకుంటున్న చంద్రబాబు, వీడియో సోషల్ మీడియాలో వైరల్
దీంతో అందరూ షాక్ కు గురయ్యారు. ఈ ఘటన సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళెం మండలం సంతవేలూరు గ్రామంలో జరిగింది.
Amaravati, April 25: తెలుగు తమ్ముళ్లే సైకిల్ పార్టీని డౌన్ డౌన్ ఆంటూ నినాదాలు చేశారు. దీంతో అందరూ షాక్ కు గురయ్యారు. ఈ ఘటన సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళెం మండలం సంతవేలూరు గ్రామంలో జరిగింది. రాత్రి సంతవేలూరులో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డాక్టర్ హెలెన్, సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత, జిల్లా పార్టీ ముఖ్య నాయకులు హాజరై ‘ఇదేమీ కర్మ’ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పురవీధుల్లో సైకిల్ జిందాబాద్ ఆనాల్సిన తెలుగు తమ్ముళ్లే సైకిల్ డౌన్ డౌన్ ఆంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు.
పార్టీ శ్రేణులు సైతం మళ్లీ మళ్లీ డౌన్ డౌన్ నినాదాలను గట్టిగా చెప్పడంతో వచ్చిన అతిథులు సైతం షాక్ కు గురయ్యారు. అంతేకాక సంతవేలూరు మాజీ సర్పంచ్ ఇంటి వద్దకు వెళ్లిన తెలుగు తమ్ముళ్లు ఒకింత అత్యుత్సాహంతో ఇంటి ముంగిట అంటించిన “మా నమ్మకం నువ్వే జగన్” స్టికర్‌ను తొలగించబోతుండగా మాజీ సర్పంచ్ సతీమణి అడ్డుకోవడం వారికి మరో చేదు అనుభవం ఎదురైంది.
Here's Video
ఇన్ని పథకాలు అందిస్తున్న ఆయన స్టికర్‌ను తొలగించడమేమిటని ఆమె గట్టిగానే మందలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం రాత్రి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ అవుతోంది