AP Coronavirus Report: ఏపీలో తాజాగా 704 కరోనా కేసులు, రాష్ట్రంలో 14,595కి చేరిన మొత్తం కేసుల సంఖ్య, 187కి చేరిన మృతుల సంఖ్య
వీటిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 51మందికి, విదేశాల నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ మేరకు మంగళవారం ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 18,114 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, మొత్తం 704 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది.
Amaravati,June 30: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 704 కరోనావైరస్ పాజిటివ్ కేసులు (AP Coronavirus Report) నమోదయ్యాయి. వీటిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 51మందికి, విదేశాల నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ మేరకు మంగళవారం ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 18,114 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, మొత్తం 704 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. పెళ్లయిన 2 రోజులకే వరుడిని కరోనా కాటేసింది, బీహార్‌లో పెళ్లికి వచ్చిన వారిలో 95 మందికి కోవిడ్-19, దేశంలో తాజాగా 18,522 పాజిటివ్ కేసులు నమోదు
దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,595కి చేరింది. ఇక గడచిన 24 గంటల్లో 258 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఏడుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 187కి (coronavirus Deaths) చేరింది. ఈ రోజు మృతి చెందిన ఏడుగురిలో కృష్ణా 3, కర్నూలు 2, గుంటూరు, అనంతపురంలో జిల్లాలో ఒక్కొక్కరు ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,897 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గత కొద్ది రోజులగా దేశంలో రికార్డు స్థాయిలో కేసులు (Coronavirus India) వెలుగు చూస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 18,522 కొత్త కరోనా కేసులు, 418 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు 5,66,840 మంది కరోనా బారిన పడగా, 16,893 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం నాటికి 3,34,822 మంది కరోనా పోరాడి కోలుకోగా, ప్రస్తుతం 2,15, 125 యాక్టివ్ కేసులు ఉన్నాయి.