AP PGECET Results 2020 Declared: ఏపీ పీజీ ఈసెట్‌ 2020 ఫలితాలు విడుదల, Sche.ap.gov.in ద్వారా మీ ఫలితాలను చెక్ చేసుకోండి

ఏయూ ఉప కులపతి ఆచార్య పీవీ జీడీ ప్రసాద్ రెడ్డి ఫలితాలను (AP PGECET Results 2020 Declared) శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏపీ పీజీ ఈ సెట్ 2020 నిర్వహించే అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

AP POLYCET Result 2020 | Representational Image (Photo Credits: PTI)

Amaravati, Oct 23: ఏపీ పీజీ ఈసెట్‌ 2020 ఫలితాలు (AP PGECET Results 2020) విడుదలయ్యాయి. ఏయూ ఉప కులపతి ఆచార్య పీవీ జీడీ ప్రసాద్ రెడ్డి ఫలితాలను (AP PGECET Results 2020 Declared) శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏపీ పీజీ ఈ సెట్ 2020 నిర్వహించే అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. కాగా ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాలకు 28,868మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. 22,911 మంది హాజరయ్యారు. 20,157 మంది అర్హులయ్యారు. 42 సెంటర్లలో ఈ టెస్ట్ నిర్వహించాం. మొత్తం 87.98 శాతం మంది అర్హులయ్యారు. ఎంటెక్‌కు 17,150 మంది హాజరు కాగా, 14,775 మంది అర్హత సాధించారు.

ఫార్మసీ పరీక్షలకు 5,761 మంది హాజరు కాగా 5,382 మంది అర్హత సాధించారు. ఎంఫార్మసీ అడ్మిషన్స్ కూడా ఆన్ లైన్‌లో నిర్వహిస్తాం. ఆంధ్ర యూనివర్సిటీ ఈ అడ్మిషన్ ప్రక్రియ నిర్వహిస్తోంది. కోవిడ్ వల్ల ఈ పరీక్షలకు హజరు కాలేని వారికి మరో సారి పరీక్ష నిర్వహిస్తున్నాము. కోవిడ్ కారణంగా దూరంగా ఉన్న విద్యార్థుల కోసం రెండవ సారి ఎంట్రన్స్ నిర్వహించమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని తెలిపారు.

తల్లిదండ్రులు అనుమతిస్తేనే స్కూళ్లకు పిల్లలు, నవంబర్ 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు ఓపెన్, నేటి నుంచి ప్రారంభమైన ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్

To Download AP PGECET Results

ఏపీలో నేటి నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ఆద్వర్యంలో ఆన్‌లైన్‌ ద్వారా సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకుగాను రాష్డ్ర వ్యాప్తంగా 25 హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. గిరిజన విద్యార్థుల సౌకర్యార్ధం తొలిసారిగా పాడేరులో హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ర్యాంకుల వారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు.

ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కొనసాగుతుంది. కరోనా నేపథ్యంలో విద్యార్థులు నేరుగా హాజరు కావాల్సిన అవసరం లేకుండా ఇళ్ల నుంచే ఆన్‌లైన్ ద్వారా సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కి హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. అత్యవసరమైతేనే హెల్ప్‌లైన్ సెంటర్లకి విద్యార్థుల రావాల్సి ఉంటుందని తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్ధం నాలుగు హెల్ప్‌లైన్ నంబర్లు: 8106876345, 8106575234, 7995865456, 7995681678 అందుబాటులో ఉంచారు. (చదవండి: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో గందరగోళం)

జనరల్, బీసీ విద్యార్థులకు 1200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి 600 రూపాయిలు ప్రాసెసింగ్ ఫీజుగా నిర్ణయించారు. నేడు (శుక్రవారం) ఒకటో ర్యాంకు నుంచి 20,000 ర్యాంకు వరకు సర్టిఫికేట్ల పరిశీలన జరగననుండగా రేపు (24)న 20,001 ర్యాంకు నుంచి 50,000 వరకు, 25న 50,001 ర్యాంకు నుంచి 80,000 వరకు, 26న 80,001 నుంచి 1,10,000 ర్యాంకు వరకు, 27న 1,10,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు సర్టిఫికేట్ల పరిశీలన జరగనుంది. పీహెచ్‌, స్పోర్ట్స్ అండ్‌ గేమ్స్, ఎన్‌సీసీ కోటా విద్యార్ధులకి విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సిలింగ్ జరగనుంది.