Adventurer CM Pema Khandu: 15వేల 600అడుగుల ఎత్తులో సీఎం రైడ్‌, వైరల్ అవుతున్న అరుణాచల ప్రదేశ్ సీఎం సాహస రైడ్, పర్యాటక రంగాన్ని ప్రోత్సాహించేందుకు సాహసం, జవాన్లతో కలిసి దివాళీ వేడుకలు జరుపుకున్న సీఎం పెమా ఖండు

ఇటీవల ఇదే ఘాట్‌ రోడ్డులో బైక్‌పై ఒంటరిగా 122 కిలోమీటర్లు ప్రయాణం చేసిన సీఎం తాజాగా మరో సాహసం చేశారు. 15,600 అడుగుల ఎత్తులో, మంచు కొండల్లో 107 కిలోమీటర్లు స్వయంగా ఏటీవీ(ఆల్‌ టెరైన్‌ వెహికల్‌) రైడ్‌ చేశారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు కూడా ఉన్నారు

Arunchal CM, Kiren Rijiju drive ATV to Tibet border (Photo-Twitter)

Itanagar, October 28: అపురూపమైన పర్యాటక ప్రదేశాలకు పేరుపొందిన ఈశాన్యరాష్టం అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమాఖండూ స్వయంగా రంగంలోకి దిగారు. ఇటీవల ఇదే ఘాట్‌ రోడ్డులో బైక్‌పై ఒంటరిగా 122 కిలోమీటర్లు ప్రయాణం చేసిన సీఎం తాజాగా మరో సాహసం చేశారు. 15,600 అడుగుల ఎత్తులో, మంచు కొండల్లో 107 కిలోమీటర్లు స్వయంగా ఏటీవీ(ఆల్‌ టెరైన్‌ వెహికల్‌) రైడ్‌ చేశారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు కూడా ఉన్నారు.

అరుణాచల్ ప్రదేశ్ లో పర్యాటకరంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సీఎం పెమాఖండూ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పర్యాటకులను ఆకర్షించేందుకు స్వయంగా పెమాఖండూనే నడుంబిగించారు. మంచుతో కూడిన ఎత్తైన ప్రదేశాల్లో సాహస క్రీడల్లో పాల్గొంటూ పర్యాటక రంగాన్నిప్రోత్సహిస్తున్నారు.

15,600 అడుగుల ఎత్తులో రైడ్

దీపావళి రోజున ఘాట్ రోడ్డులో ఒంటరిగా 122 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. సముద్రమట్టం నుంచి 15,600 అడుగుల ఎత్తులో, మంచుకొండల్లో ఆల్ టెరైన్ వెహికల్ (ఏటీవీ) ను 107 కిలోమీటర్ల దూరం నడిపారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

దీపావళి రోజున భారత్‌-టిబెట్‌/చైనా సరిహద్దుకు సమీపంలోని తవాంగ్‌ జిల్లాలో పీటీఎస్‌వో లేక్‌ నుంచి మాంగో ప్రాంతం వరకు 107 కిలోమీటర్లు ఏటీవీ నడుపుకుంటూ వెళ్లారు. 15,600 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఘాట్‌ రోడ్డులో పెమాఖండూ ఏ మాత్రం భయపడకుండా ఉత్సాహంగా వాహనాన్ని నడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను పెమాఖండూ తన సోషల్‌మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. ఆ తర్వాత సరిహద్దుల్లోని జవాన్లతో వీరిద్దరూ దీపావళి జరుపుకున్నారు.

జవాన్లతో దివాళీ వేడుకలు

ఈ సాహస యాత్రపై కిరణ్‌ రిజిజు స్పందిస్తూ.. '16వేల అడుగుల ఎత్తులో ఏటీవీని నడపటం చాలా కఠినమైన సవాల్‌. కానీ, అరుణాచల్‌ సీఎం పెమాఖండూ ఎంతో వేగంగా, అందంగా నడిపారు. ఆయన పక్కన నమ్మకంగా కూర్చున్నా' అని ట్వీట్‌ చేశారు.