AP Inter Supply Results 2024 Out: ఏపీలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల విడుదల, bie.ap.gov.in ద్వారా మీ రిజల్ట్స్ చెక్ చేసుకోండి
మూల్యాంకనం పూర్తయిన నేపథ్యంలో, నేడు ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు.
ఏపీలో మే 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్మీడియన్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మూల్యాంకనం పూర్తయిన నేపథ్యంలో, నేడు ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యా శాఖ అధికారులు ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేశారు. ఏపీలో ఏఈపీ సెట్ ఫలితాల విడుదల, టాప్ ర్యాంకర్స్ లిస్టు ఇదిగో, మీ ర్యాంక్ కార్డులను cets.apsche.ap.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోండి
సప్లిమెంటరీ పరీక్షల్లో జనరల్ కేటగిరీలో 87 శాతం, ఒకేషనల్ కేటగిరీలో 84 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఇక, ఇంటర్ ఫస్టియర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను జూన్ 26న విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ AP ఇంటర్ 2వ సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలను అధికారిక BIEAP వెబ్‌సైట్‌లలో https://resultsbie.ap.gov.in/ మరియు bie.ap.gov.in. యాక్సెస్ చేయవచ్చు.ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 5,03,459 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ అభ్యర్థుల్లో 3,65,872 మంది 1వ సంవత్సరం (11వ తరగతి), 1,37,587 మంది 2వ సంవత్సరం (12వ తరగతి) చదువుతున్నారు.