Exams Results

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్‌ పరీక్ష ఫలితాలు (AP EAPCET Results) విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.రామమోహన్‌ రావు, జేఎన్టీయూ కాకినాడ వీసీ ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు తదితరులు విడుదల చేశారు.

ఈ పరీక్షకు 3.62 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3.39 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈఏపీ సెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజ్‌ ఇచ్చి ర్యాంకులను విడుదల చేశారు.  ఫోన్‌ పేలో ఇక‌పై గోల్డ్, బైక్, కారు, హోమ్, ఎడ్యుకేషన్ లోన్లు.. బ్యాంకులు, ఎన్‌ బీఎఫ్‌ సీలతో ఫోన్‌ పే ఒప్పందం

గత నెల 16 నుంచి 23 వరకు ప్రభుత్వం ఈఏపీ సెట్‌ పరీక్షలను నిర్వహించింది. ఇటీవల సంబంధిత అధికారులు ప్రాథమిక కీని విడుదల చేయగా, ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ ను ప్రకటించడం జరిగింది. ఇంజినీరింగ్ విభాగంలో 1,95,092 మంది, అగ్రికల్చరల్‌ విభాగంలో 70,352 మంది విద్యార్థులు అర్హత సాధించారని పరీక్షల విభాగం అధికారులు తెలిపారు.

ఇంజనీరింగ్ విభాగంలో టాప్ ర్యాంకర్స్

మాకినేని జిష్ణు సాయి (గుంటూరు జిల్లా)

మురసాని సాయి యశ్వంత్‌ రెడ్డి (కర్నూలు)

బోగాలపల్లి సందేశ్‌ (ఆదోని)

పాలగిరి సతీశ్‌ రెడ్డి( బుక్కరాయసముద్రం-అనంతపురం)

కోమటినేని మనీశ్ చౌదరి (గుంటూరు)

యప్పా లక్ష్మీనరసింహారెడ్డి (సిద్దిపేట-తెలంగాణ)

గొల్ల లేఖాహర్ష (కర్నూలు)

పుట్టి కుశాల్‌ కుమార్‌ (అనంతపురం)

పరమారాధ్యుల సుశాంత్‌ (హనుమకొండ-తెలంగాణ)

కొమిరిశెట్టి ప్రభాస్‌ (అక్కపాలెం-ప్రకాశం)

అగ్రికల్చర్‌ విభాగంలో టాప్‌ 10 ర్యాంకర్లు..

ఎల్లు శ్రీశాంత్‌ రెడ్డి (హైదరాబాద్‌)

పూల దివ్యతేజ (తలుపుల -సత్యసాయి)

వడ్లపూడి ముఖేశ్‌ చౌదరి (తిరుపతి)

పేరా సాత్విక్‌ (పులిచెర్ల-చిత్తూరు)

ఆలూరు ప్రణీత (మదనపల్లె-అన్నమయ్య)

గట్టు భానుతేజ సాయి ((పాపంపేట- అనంతపురం))

పెన్నమాడ నిహారిక రెడ్డి (హైదరాబాద్‌)

శంబంగి మనో అభిరామ్‌ (గాజువాక-విశాఖ)

శరగడం పావని (గాజువాక-విశాఖ)

నాగుదాసరి రాధాకృష్ణ (పార్వతీపురం-మన్యం)