School Summer Holidays Extended in AP: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, జూన్ 30 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు, జూన్ 3తో ముగియనున్నఈ ఏడాది విద్యా సంవత్సరం, ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు వాయిదా

ఈ నేపథ్యంలో విద్యార్థుల సెలవులపై ఏపీ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలలకు వేసవి సెలవులను (School Summer Holidays) జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు తాజా ప్రకటన చేసింది.

Representational Image (Photo Credits: PTI)

Amaravati, May 31: ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల సెలవులపై ఏపీ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలలకు వేసవి సెలవులను (School Summer Holidays) జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు తాజా ప్రకటన చేసింది. ఈ ప్రకటన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తుందని తెలిపింది. జూన్ 30 తర్వాత పరిస్థితిని సమీక్షించి స్కూళ్లపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్‌ చిన వీరభద్రుడు ఉత్తర్వులను జారీ చేశారు. వాస్తవానికి ఈ విద్యా సంవత్సరం జూన్ 3తో ముగియనుంది. అయితే కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించకుండానే మరోమారు సెలవులను (Summer vacation) పొడిగించింది. అయితే కరోనా వ్యాప్తిని దృష్టిలో (Covid-19 second wave) ఉంచుకుని విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించకుండానే మరోమారు సెలవులను పొడిగించింది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పదో తరగతి పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జూన్ 7 నుంచి టెన్త్ క్లాస్ పరీక్షలు జరగాల్సి ఉండగా, కరోనా వ్యాప్తి కొనసాగుతుండడంతో వాయిదా వేశారు.

ఏపీలో ఒక్కరోజే 21,133 మంది కరోనా నుంచి కోలుకుని ఇంటికి, తాజాగా 13,400 మందికి కరోనా పాజిటివ్‌, 94 మంది మృతితో 10,832కు పెరిగిన మరణాల సంఖ్య, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 808 బ్లాక్‌ఫంగస్‌ కేసులు నమోదు

ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ లో తరగతులు నిర్వహిస్తున్నారు. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఇప్పటివరకు పరీక్షలు నిర్వహించనేలేదు. ఇక జూన్ 30 తర్వాత అప్పటి పరిస్థితిని సమీక్షించి సెలవులు పొడిగించాలా.? లేక పరీక్షలు నిర్వహించాలా.? అనే దానిపై ఓ నిర్ణయానికి వస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.