Amaravati, May 30: ఏపీలో గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 79,564 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 13,400 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ (Coronavirus Pandemic) అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 16,82,247 మందికి కరోనా వైరస్ (Coronavirus Positive Cases) సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 94 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 10,832కు చేరింది.
గడిచిన 24 గంటల్లో 21,133 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 14 లక్షల 87 వేల 382 మంది డిశ్చార్జ్ అయ్యారు.ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 1,98,023 యాక్టివ్ కేసులు (Active Cases) ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,90,88,611 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
గత 24 గంటల్లో అనంతపురంలో 1215 కేసులు, చిత్తూరులో 1971, ఈస్ట్ గోదావరిలో2598, గుంటూరులో 848, కడపలో 701, కృష్ణాలో 858, కర్నూలులో 712, నెల్లూరులో 652, ప్రకాశంలో 838, శ్రీకాకుళంలొ 623, విశాఖపట్నంలో 1054, విజయనగరంలో 362, వెస్ట్ గోదావరిలో 928 కేసులు నమోదయ్యాయి.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటికే 57 ఆస్పత్రుల్లో పీఎస్‌ఏ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ 50 పడకలు దాటితే ఆక్సిజన్ ప్లాంటు కచ్చితంగా ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. వారం రోజుల్లో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు వస్తాయన్నారు. శనివారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు.
Here's Covid Report
#COVIDUpdates: As on 30th May 2021 10:00 AM
COVID Positives: 16,82,247
Discharged: 15,05,620
Deceased: 10,832
Active Cases: 1,65,795#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/FROzxNTRnp
— ArogyaAndhra (@ArogyaAndhra) May 30, 2021
ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు పరిశ్రమల శాఖ రాయితీలు ఇస్తుందని, భవిష్యత్‌లో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేకుండా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. రాష్ట్రంలో 16 చోట్ల సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ప్రభుత్వం ఆహ్వానిస్తోందని, రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టే వారికి భూమిలో రాయితీ ఇస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. దీనికోసం భూములు కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 808 బ్లాక్‌ఫంగస్ కేసులు నమోదయ్యాయన్నారు. బ్లాక్‌ఫంగస్ చికిత్సకు సంబంధించిన యాంఫోటెరిసిన్–బి ఇంజక్షన్లు కేంద్రం ఇస్తేనే తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని, దీనికి మరో మార్గం లేదన్నారు. ఇంజక్షన్ల కోసం అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి కేంద్రం 7,726 ఇంజక్షన్లు కేటాయించిందన్నారు. ప్రస్తుతం ఉన్న 2,475 యాంఫోటెరిసిన్–బి ఇంజక్షన్లు జిల్లాలకు పంపించామని, పొసకొనజోల్ ఇంజక్షన్లు, మాత్రలు కూడా కొనుగోలు చేస్తున్నామన్నారు.
రాష్ట్రంలో రోజువారీ ఆక్సిజన్ వినియోగం తగ్గిందని, ఒక దశలో 620 టన్నుల వినియోగం జరిగిందని, ఇప్పుడు 510 టన్నులు వినియోగం అవుతోందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై 66 విజిలెన్స్ కేసులు నమోదయ్యాయని, వీటిలో 43 ఆస్పత్రులపై పెనాల్టీలు వేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కర్ఫ్యూ వంటి నిర్ణయాల వల్ల రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, అన్ని జిల్లాలో తగ్గిన ప్రభావం కనిపిస్తోందన్నారు.