Andhra pradesh Cm Ys Jagan( Photo-Twitter)

Amaravati, May 30: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల పాలన సంబరాలు ఒక రోజు ముందుగానే మొదలయ్యాయి. ట్విట్టర్‌లో ‘2ఇయర్స్‌ ఫర్‌ వైఎస్‌ జగన్‌ అనే నేను’ (#2YearsForYSJaganAneNenu) హ్యాష్‌ట్యాగ్‌ శనివారం దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచింది.

ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్‌లో క్రియేట్‌ చేసిన రెండున్నర గంటల్లోనే లక్ష మందికిపైగా ట్వీట్లు చేశారు. గతంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా సృష్టించిన హ్యాష్‌ట్యాగ్‌ కూడా భారీగా ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక గతేడాది సీఎంగా మొదటి ఏడాది పూర్తి చేసుకున్నప్పుడు రూపొందించిన హ్యాష్‌ట్యాగ్‌ను 20 లక్షలకు మందికిపైగా ట్రెండింగ్‌ చేశారు.

ఇక రెండేళ్ల పాలన పూర్తైన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు నివేదించనున్న అంశాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ పుస్తకంలో మేనిఫెస్టోలో చెప్పినవాటితోపాటు చెప్పని అంశాలను కూడా ఈ రెండేళ్లలో ఎలా అమలు చేశారో వివరిస్తారు. అంతేకాకుండా ప్రజల దగ్గరకు ఆ పుస్తకాన్ని పంపించి.. అమలు తీరును పరిశీలించాల్సిందిగా కోరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున ‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనే నేను (YS Jagan Ane nenu) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా.. అంటూ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార సమయంలో ‘వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో అంటే మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్‌. మేనిఫెస్టోలో ఏమి చెప్పామో, వాటిని తప్పనిసరిగా నెరవేరుస్తాం. కులం, మతం, ప్రాంతం, రాజకీయం.. ఇవేవీ చూడకుండా అర్హులందరినీ ఆదుకోవడమే మనందరి ప్రభుత్వ లక్ష్యం’ అని చెప్పారు. ఇప్పటి వరకు అదే బాటలో పయనిస్తూ, విప్లవాత్మక నిర్ణయాలతో, పథకాలతో పరిపాలనలో ఏపీ సీఎం తనదైన ముద్రను వేశారు.

కర్ప్యూ దెబ్బకు తగ్గిన కరోనా కేసులు, పెరిగిన డిశ్చార్జ్ రేటు, తాజాగా 20,392 మంది కొవిడ్ నుంచి కోలుకుని ఇంటికి, గత 24 గంటల్లో 13,756 మందికి పాజిటివ్, ఏపీలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రెండేళ్ల క్రితం మొదలైన సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయని డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ పేర్కొన్నారు. శనివారం ఆయనొక ప్రకటన చేస్తూ.. డిజిటలైజేషన్‌ దిశగా అడుగులు వేస్తున్న పోలీసు శాఖలో క్రమం తప్పకుండా అర్హత ప్రాతిపదికన ప్రతి ఒక్కరికీ సకాలంలో పదోన్నతులు కలిగే పరిపాలన వ్యవస్థ రూపుదిద్దుకుందని తెలిపారు. రాష్ట్రంలో ఒకేసారి 181 మంది ఎస్సైలకు సీఐలుగా పదోన్నతి కల్పించడం పోలీస్‌ శాఖ చరిత్రలోనే ఒక మైలురాయి అని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానసపుత్రిక అయిన ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థ అనతికాలంలోనే దేశం దృష్టిని ఆకర్షించింది. బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే 2.66 లక్షల మంది వాలంటీర్ల నియామకాన్ని చేపట్టి వారికి నిర్దిష్టమైన బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు అనుసంధానంగా వాలంటీర్లు విధులు నిర్వర్తిస్తున్నారు.గడచిన రెండేళ్లలో 31 రకాల సంక్షేమ పథకాల ద్వారా రూ.1.25 లక్షల కోట్లు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ లబ్ధిదారులకు చేరాయి.

చిత్తూరు జిల్లాలో జూన్ 15 వరకు కర్ఫ్యూ పొడిగింపు, కఠిన నిబంధనలు అమలు చేయాలని అధికారులను ఆదేశించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇకపై కొవిడ్‌ నెగిటివ్ ఉంటేనే జిల్లాలోకి ఎంట్రీ

సీఎం చేపట్టిన మనబడి నాడు–నేడు, వైద్య రంగం నాడు–నేడు’ జగనన్న అమ్మ ఒడి పథకం, వసతి దీవెన, కార్యక్రమాలు రాష్ట్రంలో కొత్త ఒరవడికి నాంది పలికాయి. ఒకేసారి 16 కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ప్రాథమిక వైద్యానికి పెద్దపీట వేస్తూ వైఎస్సార్‌ హెల్త్‌క్లినిక్‌లు, కొత్త పీహెచ్‌సీల నిర్మాణం, సామాజిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు చేపట్టారు. రాష్ట్ర జనాభాలో వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ ద్వారా 95 శాతం కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించారు. కోవిడ్‌–19, బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సలను వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీలోకి చేర్చడం ద్వారా లక్షకు పైగా పేద, సామాన్యులకు కోవిడ్‌ చికిత్సను ఉచితంగా అందించారు.

ఈ రెండేళ్లలో నవరత్నాల ద్వారా 6.5 కోట్ల మందికి వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా రూ.95,528.50 కోట్లు నేరుగా బదిలీ చేశారు. నగదేతర పథకాల ద్వారా మరో 2.36 కోట్ల మందికి రూ.36,197.05 కోట్ల ఆర్థిక ప్రయోజనం కల్పించారు. మద్య నియంత్రణలో భాగంగా 20 శాతం మద్యం దుకాణాలు తగ్గించడమే కాకుండా బెల్టు షాపులు, పర్మిట్‌ రూమ్‌లను తొలగించారు. ఇటీవల మరో 13 శాతం దుకాణాలు తగ్గించారు. ఒక పక్క ఆదాయం రాదని తెలిసినప్పటికీ మేనిఫెస్టోలో చెప్పిన మేరకు, పేద అక్కచెల్లెమ్మల బాగు కోసం ముందుకే అడుగులు వేశారు.

విమాన ప్రయాణికులకు షాక్, ఛార్జీలు 13 నుంచి 16 శాతానికి పెంపు, 40 నిమిషాల ప్రయాణ ఛార్జీ రూ.2,300 నుంచి రూ.2,600, పెరిగిన ధరల లిస్ట్ ఇదే..

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇప్పటి దాకా మొత్తం 6,53,01,890 మంది లబ్ధిదారులకు (ఒక్కో లబ్ధిదారునికి ఒకటి కంటే ఎక్కువ పథకాలు దక్కాయి) రూ.95,528.50 కోట్లను నేరుగా నగదు బదిలీ చేసింది. నగదేతర పథకాల ద్వారా మొత్తం 2,36,16,150 మంది లబ్ధిదారులకు రూ.36,197.05 కోట్లు పంపిణీ చేసింది. మొత్తంగా నగదు, నగదేతర పథకాల ద్వారా 8,89,18,040 మందికి రూ.1,31,725.55 కోట్లు పంపిణీ చేసింది.

కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లల పేరిట రూ. 10 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి దానిపై వచ్చే వడ్డీతో వారికి భరోసా కల్పించారు. వారికి ఉచితంగా చదువు చెప్పించి.. 25 ఏళ్లు వచ్చిన తర్వాత ఆ సొమ్ము వారికే దక్కేలా పథకాన్ని అమల్లోకి తెచ్చారు. సీఎం జగన్‌ నిర్ణయం ప్రకటించిన కొద్ది కాలానికే ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్,కేరళ సీఎం పినరయి విజయన్‌ కూడా అదే బాటలో పయనిస్తున్నారు.

ప్రతీ విద్యార్థికి ఉచితంగా చదువు చెప్పించడమే కాకుండా వారికి 25 ఏళ్లు వచ్చే వరకు ప్రతీ నెల రూ. 2,500 నగదు సాయం చేస్తామని ఢిల్లీ సీఎం ప్రకటించారు. ఉచితంగా విద్యతో పాటు అనాథలైన పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు ప్రతీ నెల రూ. 2,000 ఆర్థిక సాయం చేస్తామని కేరళ సీఎం ప్రకటించారు. ఇక తమిళనాడు సీఎంగా ఇటీవలే పదవి పగ్గాలు చేపట్టిన ఎంకే స్టాలిన్‌ రూ. 5,00,000 లక్షల సాయం ప్రకటించారు.

కేంద్రం కూడా కరోనాతో అనాథలైన పిల్లలకు ఉచిత విద్యను అందించడమే స్కాలర్‌షిప్‌ ప్రకటించింది. 18 ఏళ్లు నిండిన వారి పేరిట రూ. 10 లక్షల కార్పస్‌ఫండ్‌ ఏర్పాటు చేస్తామంది. వారికి 23 ఏళ్లు వచ్చిన తర్వాత ఆ సొమ్ము అందిస్తామంది. ఆయుష్మాన్‌ భారత్‌ కింద రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమాతో పాటు అనాథ పిల్లల ఉన్నత విద్యకు విద్యారుణం, వడ్డీ కట్టనున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది.

అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే రివర్స్‌ టెండరింగ్, జ్యుడిషియల్‌ ప్రివ్యూ విధానాన్ని ప్రవేశపెట్టారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో అక్రమార్కుల తప్పుడు అంచనాలకు  అడ్డుకట్ట వేశారు.  ఫలితంగా రివర్స్‌​ టెండరింగ్‌ ద్వారా రెండేళ్ల కాలంలో రూ. 5,070 కోట్ల ప్రజాధనం పక్కదారి పట్టకుండా నిలువరించ గలిగారు.

జాతీయ ప్రాజెక్టయిన పోలవరంతో రివర్స్‌ టెండరింగ్‌ మొదలు పెట్టి ఇతర సాగునీటి ప్రాజెక్ట్‌లతో పాటు  మున్సిపల్, విద్య, వైద్య, విద్యుత్, హౌసింగ్, పంచాయతీరాజ్‌ సహా పలు శాఖల్లో అమలు చేశారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు జలవనరుల శాఖలో 26 పనులకు సంబంధించి  రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.1824.65 కోట్ల ప్రజాధనాన్ని ఏపీ ప్రభుత్వం ఆదా చేయగలిగింది .

గృహనిర్మాణశాఖ (ఏపీ టిడ్కో)లో చేపట్టిన 12 పనుల్లో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా  రూ. 392.23 కోట్ల రూపాయల ఆదా అయ్యింది.  మరోవైపు గహనిర్మాణశాఖలో గ్రామీణ ప్రాంతాల్లో 5 పనులకు సంబంధించి చేపట్టిన రివర్స్‌టెండరింగ్‌లో రూ.811.32 కోట్లు మిగులు వచ్చేలా చేసింది ఏపీ ప్రభుత్వం.

విద్యాశాఖలో 21 పనులుకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించగా ఏకంగా రూ. 325.15 కోట్లు ఆదా అయ్యాయి. ఏపీ జెన్కోలో 4 పనులకు గాను రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించడం ద్వారా రూ.486.46 కోట్ల ప్రజా ధనం ఆదా అయింది.  ఆంధ్రప్రదేశ్‌ మెడికిల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్టర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎంఎస్‌ఐడీసీ)లో చేపట్టిన 34 పనులకు రివర్స్‌ టెండర్లు నిర్వహించారు. వీటి ద్వారా  రూ.625.54 కోట్లు ప్రజాధనం ఆదా అయింది.

రివర్స్‌ టెండర్‌ ఫలితాలు శాఖల వారీగా

1. పోలవరం ప్రాజెక్టు సహా జలవనరులశాఖ        : రూ.1824.65 కోట్లు

2. ఏపీ టిడ్కో                                               : రూ.392.23 కోట్లు

3. గృహనిర్మాణశాఖ (రూరల్‌)                          : రూ.811.32  కోట్లు

4. పంచాయతీరాజ్‌శాఖ                                  : రూ. 605.08 కోట్లు

5. ఏపీ జెన్కో                                               : రూ. 486.46 కోట్లు

6. విద్యాశాఖ                                               : రూ. 325.15 కోట్లు

7. APMSIDC                                            : రూ. 625.54 కోట్లు

రెండేళ్లలో మహిళ స్వాలంబన, సంక్షేమం మీద రూ.  రూ.88,040.29 కోట్ల ధనం వెచ్చించింది. పథకాల ద్వారా 4.36 కోట్ల మంది మహిళాలకు మేలు జరిగింది. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా తొలి విడతగా గతేడాది రూ. 6,310 కోట్లను ప్రభుత్వం అందచేసింది. ఈ సొమ్ము 77,75,681 మంది డ్వాక్రా మహిళల ఖాతాల్లో పడ్డాయి. సకాలంలో రుణం చెల్లించిన సంఘాలకు  ఆ రుణంపై వడ్డీ మొత్తాన్ని వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తోంది.

దీంతోపాటు 2019 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి వరకు  90,37,255 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.1,400 కోట్ల వడ్డీ బకాయిలు కూడా వారి తరపున ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించింది. ఇప్పుడు స్వయం సహాయక సంఘాల సంఖ్య 8.71 లక్షల నుంచి 9.34 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం ఈ సంఖ్య 1.11 కోట్లకు చేరింది. ఇప్పటివరకు  ఈ పథకం క్రింద 98,00,626 మంది మహిళా పొదుపు సంఘాల సభ్యులకు మొత్తం రూ.2,354.22 కోట్లు లబ్ది చేకూరింది.

వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 45 నుండి 60 ఏళ్ల మధ్య వయస్సు గల ఎస్సీ, ఎస్టీ,. బీసీ, మైనారిటీ మహిళలకు ఏటా రూ.18,750 ల చొప్పున ఆర్థిక సాయం ఏపీ ప్రభుత్వం అందిస్తోంది. చేయూత సాయంతో ఇప్పటికే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 69,000 షాపులు కొత్తగా ఏర్పాటయ్యాయి. 2021 ఏప్రిల్ నాటికి వైఎస్సార్ చేయూత పథకం క్రింద 24,55,534 మంది మహిళల ఖాతాల్లో రూ.4,604.13 కోట్లు ప్రభుత్వం జమ చేసింది.

45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయస్సు ఉన్న పేద కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాల పేద అక్కచెల్లెమ్మలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా వైఎస్సార్ కాపు నేస్తం పథకం ద్వారా ఏటా రూ.15,000 ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేస్తోంది. ఇప్పటివరకు 3,27,862 మంది మహిళలకు రూ.491.79 కోట్ల ఆర్థిక సాయం అందించడం జరిగింది.

గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం ను సీఎం జగన్‌ అమల్లోకి తెచ్చారు.  దీనికి రూ.1,863.13 కోట్లు ప్రస్తుత ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. తద్వారా 30,16,000 మంది అక్కచెల్లెమ్మలు, చిన్నపిల్లలు లబ్ది పొందుతున్నారు.

45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వయసున్న ఆర్థికంగా వెనుకబడి ఉన్న బ్రాహ్మణ, వెలమ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళలందరికీ వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా అర్హులైన మహిళకు ఏడాదికి రూ. 15,000 ప్రభుత్వం సాయం అందిస్తుంది. ఈ పథకం ద్వారా 4 లక్షల మంది లబ్ది పొందనున్నారు.

జగనన్న జీవ క్రాంతి పథకం ద్వారా  ఆవులు, గేదెలకు సంబంధించి 1.12.008యూనిట్లను కొనుగో చేయించింది. మేకలు /గొర్రెలకు సంబంధించి ప్రభుత్వం 72,179 యూనిట్లు కొనుగోలు చేయించి మహిళలకు ఆదాయం పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

వైఎస్సార్ లా నేస్తం ద్వారా 721 మందికి రూ.3.21 కోట్లు ఖర్చు చేశారు

- జగనన్న విద్యా దీవెన కింద 10,88,439 మంది తల్లుల ఖతాల్లో రూ.2,477.89 కోట్లు జమ

- జగనన్న వసతి దీవెన ద్వారా 15,56,956 మంది తల్లులకు రూ.2,269.93 కోట్లు అందచేత

- జగనన్న చేదోడు కింద 1,36,340 మంది అక్కచెల్లెమ్మలకు రూ.136.64 కోట్లు అందించిన ప్రభుత్వం

- జగనన్న గోరుముద్ద పథకం ద్వారా 18,20,196 మంది బాలికలకు రూ.789.54 అందచేత

- జగనన్న విద్యాకానుక పథకం ద్వారా 21,86,972 మంది బాలికలకు రూ. 334.61 కోట్లు ఖర్చు చేసింది.

రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఒకటి చొప్పున 10,778 డాక్టర్‌ వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. నవరత్నాల్లో భాగంగా ఏర్పాటైన ఈ కేంద్రాల లక్ష్యం పంట ఉత్పాదకత మెరుగుపర్చడం, సాగు ఖర్చు తగ్గించడం. దీనికి అవసరమైన అన్ని రకాల ఉత్పాదకాలు–విత్తనం మొదలు విక్రయం వరకు రైతు ఇంటి ముంగిటే అందించడం లక్ష్యంగా ఇవి పనిచేస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల కోసం వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టి అమలుచేస్తోంది. మూడు విడతల్లో కలిపి రూ.13,500 అందిస్తోంది. అలాగే భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులతో పాటు పోడు భూముల సాగుదారులకు కూడా రైతు భరోసా ఇస్తోంది. తొలి ఏడాది 1,58,123 మంది కౌలుదారులు, పోడు భూముల సాగుదారులకు లబ్ధి చేకూరగా.. గతేడాది 1,54,171 మందికి పెట్టుబడి సాయం అందింది. ఈ ఏడాది 1,86,254 మందికి రైతు భరోసా లభించింది.

రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు’ పథకాన్ని సీఎం జగన్‌ తీసుకొచ్చారు. రూ.లక్ష వరకు పంట రుణాలు తీసుకొని ఏడాది లోపు దాన్ని తిరిగి చెల్లించిన రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో రైతులకు రూ.1,202.61 కోట్ల వడ్డీ రాయితీ అందజేసింది. 2019(ఖరీఫ్‌)లో అర్హులైన 14,26,994 మందికి రూ.289.42 కోట్లు.. 2019–20(రబీ)లో అర్హులైన 6,27,906 మందికి రూ.128.47 కోట్లు జమ చేసింది.

రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం ద్వారా నష్టపోయిన మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు.