Flight / Representative Image

New Delhi, May 29: విమాన ప్రయాణం చేసే వారికి షాకింగ్ న్యూస్..దేశీయ విమాన ప్ర‌యాణ ఛార్జీల‌ను (Domestic Flights Cost) పెంచేశారు. పౌర‌విమాన‌యాన శాఖ ఈ మేరకు శుక్ర‌వారం కొత్త ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన ధరలు జూన్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థలు తమ ఛార్జీల పట్టికలో మార్పులు (New Domestic Airfare) చేస్తున్నాయి.

విమానయాన కనీస ఛార్జీలు 13 నుంచి 16 శాతానికి పెరుగుతున్నాయి. 40 నిమిషాల ప్రయాణ ఛార్జీ రూ.2,300 నుంచి రూ.2,600కు ఉండనుంది. 60 నిమిషాల ప్రయాణ ఛార్జీ రూ.2,900 నుంచి రూ.3,300కు పెరగనుంది. 60-90 నిమిషాల ప్రయాణానికి రూ.4000, 90-120 ని.కు రూ.4700, 120-150 ని.కు రూ.6100, 180-210 ని.కు 8700 దిగువ పరిమితిగా ఉండనుంది.

విమాన‌యాన సంస్థ‌లు జూన్ ఒక‌టో తేదీ నుంచి కేవ‌లం 50 శాతం మాత్ర‌మే త‌మ స‌ర్వీసుల‌ను న‌డ‌పాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. ప్ర‌స్తుతం కోవిడ్ వ‌ల్ల 80 శాతం స‌ర్వీసుల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉన్న‌ది. కోవిడ్ సెకండ్ వేవ్ వ‌ల్ల గ‌త కొన్ని వారాల నుంచి విమాన ప్ర‌యాణికులు చాలా వ‌ర‌కు త‌గ్గిపోయారు. మే నెల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 40 వేల మంది ప్ర‌యాణికులు దేశీయ విమానాల్లో తిరిగిన‌ట్లు తెలుస్తోంది.

కరోనా నుంచి కోలుకున్న ఇండియా, కేసులు తగ్గుముఖం, 24 గంటల్లో 1,73,790 కొత్త కేసులు నమోదు, 3,617 మంది మృతితో ,22,512కు పెరిగిన మరణాల సంఖ్య, ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సిన్

కరోనా రెండో దశ విజృంభణతో విమానయాన రంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ క్రమంలోనే విమానయాన రంగానికి ఊతమిచ్చేలా మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. గతేడాది దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌.. ఈ ఏడాది మార్చి నుంచి విమానయాన సేవలు అంతంత మాత్రమే కొనసాగాయి. అంతర్జాతీయంగా కూడా ప్రతికూల వాతావరణం ఉండడంతో విమానయాన రంగం తీవ్రంగా నష్టపోయింది.

పెరిగిన ధరలు ఇవే..

కనీస ఛార్జీలు 13 నుంచి 16 శాతానికి పెంపు

40 నిమిషాల ప్రయాణం: రూ.2,600కు పెంపు..అత్యధిక ధర రూ.7,800

60 నిమిషాల ప్రయాణం: రూ.3,300కు పెంపు... అత్యధిక ధర రూ.9,800

60-90 నిమిషాల ప్రయాణానికి రూ.4000,

90-120 ని.కు రూ.4700,

120-150 ని.కు రూ.6100,

180-210 ని.కు 8700 దిగువ పరిమితి