Air Fare Caps: తగ్గనున్న దేశీయ విమానచార్జీలు, కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, విమాన ఛార్జీలపై నియంత్రణను ఎత్తివేసిన సివిల్ ఏవియేషన్‌, పోటాపోటీగా డిస్కౌంట్లు ఇచ్చే ఛాన్స్
Flight | Representational Image | (File Photo)

New Delhi, AUG 10:  కరోనా తర్వాత ఏర్పడ్డ పరిస్థితుల నుంచి ఒక్కో రంగం సాధారణస్థితికి వస్తోంది. తాజాగా విమానరంగానికి (Aviation) సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. కరోనా (Corona) సమయంలో విధించి ప్రైస్ బ్యాండ్‌ ను (removes fare bands) ఎత్తివేసింది. దీంతో విమానయాన సంస్థలకు సంబంధించి ఇక నుంచి చార్జీలపై ఎలాంటి పరిమితులు ఉండవు. చార్జీల అమలుకు సంబంధించి కేంద్రానికి నియంత్రణ ఉండదు. ఇకపై దేశీయ మార్గాల్లో విమాన చార్జీలపై (domestic fare caps) ఉన్న పరిమితులను తొలగించినట్లు దేశ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (Ministry of Civil Aviation)  తెలిపింది. ఈ నిర్ణయం ఆగస్టు 31 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఇకపై ప్రయాణికుల ఛార్జీలపై విమానయాన సంస్థలే స్వేచ్చగా నిర్ణయం తీసుకోవచ్చు.

గతంలో దేశీయ మార్గాల్లో ఛార్జీల పై కనిష్ట, గరిష్ట పరిమితులు విధించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నిర్ణయం ద్వారా తక్కువ చార్జీల వల్ల విమాన సంస్థలు, డిమాండ్‌ ఉన్న సమయాల్లో భారీ రేట్లతో ప్రయాణికులు నష్టపోకుండా ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంది. అయితే ప్రస్తుతం విమాయాన రంగం క్రమక్రమంగా కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో ఛార్జీలపై పరిమితులను ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

Nupur Sharma Row: నుపుర్ శర్మపై నమోదైన కేసులన్నీ ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసిన సుప్రీంకోర్టు, ఆ కేసుల‌న్నింటినీ ఢిల్లీ పోలీసులే విచారిస్తార‌ని వెల్లడి 

ఈ క్రమంలో విమాన ఛార్జీలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో విమానయాన సంస్థలు తమ విమానాల్లో ప్యాసింజర్లతో నింపేందుకు టిక్కెట్‌లపై డిస్కౌంట్‌లను అందించే అవకాశమే ఎక్కవగా ఉందంటూ నిపుణులు చెప్తున్నారు. రానున్న రోజుల్లో దేశీయంగా విమాన రంగం వృద్ధి సాధిస్తుందని విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆశాభావం వ్యక్తం చేశారు. డిమాండ్, ఇంధన ధరలను జాగ్రత్తగా విశ్లేషించిన తర్వాత ఛార్జీల పరిమితులను తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.