ప్రజలందరి సహకారంతో రెండేళ్ల పాలన పూర్తి చేసుకోగలిగామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, 86 శాతం ప్రజలకు ఏదో ఒక సంక్షేమ పథకం చేరిందన్నారు. ప్రజలకు నేరుగా రూ.95,528 కోట్లు.. ఇతర పథకాల ద్వారా మరో రూ.36,197 కోట్లు.. మొత్తంగా రూ.1.31 లక్షల కోట్లు అందించగలిగామని తెలిపారు.
ప్రతి గ్రామ సచివాలయం వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి సిబ్బందికి సీఎం వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరి సహకారంతోనే సుపరిపాలన అందించగలిగాం. రెండేళ్లలోనే 94.5 శాతం హామీలను పూర్తి చేశాం. రెండేళ్ల పాలనలో అందరికి మంచి చేశానన్న నమ్మకం ఉంది. రాబోయే కాలంలో ఇంకా మంచి చేసేందుకు శక్తి ఇవ్వాలని దేవున్ని కోరుతున్నానని’’ సీఎం జగన్ అన్నారు.
ప్రజలందరి చల్లని దీవెనలతో రెండేళ్ల పాలన పూర్తి
-అక్షరాల రూ.1,31,725 కోట్లు ప్రజా సంక్షేమానికి వెచ్చించాం
-రాష్ట్రంలోని 86 శాతం ఇళ్లకు సంక్షేమ పథకాలు అందించాం
-66 శాతం పథకాలు అక్కచెల్లెమ్మల పేరుమీదే అమలు చేస్తున్నాం https://t.co/l75Dqhllt3 #2YearsForYSJaganAneNenu
— YSR Congress Party (@YSRCParty) May 30, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)