Andhra Pradesh: ఏపీ విద్యార్థులకు అలర్ట్ న్యూస్, ఈ నెల 20వ తేదీలోపు గురుకుల పాఠశాలల్లో ప్రవేశం పొందాలి, 38 సాధారణ, 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశానికి విద్యార్థుల ఎంపిక జాబితా ఖరారు

Narasimha Rao) తెలిపారు.

Representational Image (Photo Credits: PTI)

Amaravati, June 15: ఏపీ రాష్ట్రంలో 38 సాధారణ, 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశానికి ఎంపికైన విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు ప్రవేశం (Students Must Join before June 20th ) పొందాలని ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌.నరసింహారావు (Gurukul Schools Secretary R. Narasimha Rao) తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 2022–23 విద్యా సంవత్సరంలో 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన విద్యార్థుల ఎంపిక జాబితాను ఖరారు చేసినట్లు తెలిపారు. 20వ తేదీ తర్వాత మిగిలిన ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు.

గతంలో ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో వచ్చిన సీటును వదిలేసుకున్నవారికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నిర్వహణ సంస్థ ఐఐటీ బాంబే షాకిచ్చింది. అలాంటివారు ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అవకాశం లేదని తేల్చిచెప్పింది. దీని ప్రకారం.. గతంలో కౌన్సెలింగ్‌ ద్వారా కేటాయించిన సీటుకు అంగీకారం తెలిపి.. తర్వాత చేరని విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌–2022 పరీక్ష రాసే అవకాశం ఉండదు. అలాగే ఐఐటీల్లో చేరి మధ్యలో మానేసినవారికి కూడా చాన్స్‌ లేదని పేర్కొంది.

టెన్త్‌ ఫెయిల్‌ అయిన ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు గుడ్ న్యూస్, రోజుకు 2 సబ్జెక్టుల్లో కోచింగ్‌, 13 నుంచి పరీక్షలు ముగిసేవరకు స్కూళ్లలో వారికి ప్రత్యేక బోధన

అదేవిధంగా జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా)–2021 కౌన్సెలింగ్‌లో కేటాయించిన ఐఐటీ సీటును ఆమోదించి.. ఆ తర్వాత చివరి రౌండ్‌ కౌన్సెలింగ్‌కు ముందువరకు దాన్ని ఉపసంహరించకుండా కొనసాగి ఉంటే వారికి కూడా అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. అలాగే అడ్వాన్స్‌డ్‌లో అర్హత మార్కులు సాధించినవారే ఆర్కిటెక్ట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఏఏటీ)కి అర్హులని పేర్కొంది. జేఈఈ మెయిన్‌ పేపర్‌ 2ఏ, 2బీల్లో అర్హత ఉన్నా అడ్వాన్స్‌డ్‌ రాయకుండా నేరుగా ఏఏటీ పరీక్షకు అవకాశం ఉండదని తెలిపింది. అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు సంబంధించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ ఐఐటీ బాంబే ఈ విషయాలు వెల్లడించింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif