AP Inter Result 2023: మే 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు, రీవెరిఫికేషన్ కి మే 6 లోపు అప్లై చేసుకోవాలని తెలిపిన మంత్రి బొత్స

ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఒకేసారి ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు విడుదల చేశారు. విద్యాశాఖ కేవలం 22 రోజుల వ్యవధిలో ఫలితాలు విడుదల చేసింది.

Minister Botsa Satyanarayana (Photo-Video Grab)

ఏపీలో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఒకేసారి ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు విడుదల చేశారు. విద్యాశాఖ కేవలం 22 రోజుల వ్యవధిలో ఫలితాలు విడుదల చేసింది.

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో 61 శాతం ఉత్తీర్ణత కాగా ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల్లో 72 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో 77 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ఫస్ట్‌ రాగా 70 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా సెకండ్‌ వచ్చింది. 68 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా థర్డ్‌ వచ్చింది.

ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల, ఫస్ట్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఒకేసారి, ఫలితాలను bie.ap.gov.in ద్వారా చెక్ చేసుకోవవచ్చు

ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల్లో 83 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ఫస్ట్‌ రాగా 78 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా సెకండ్‌ వచ్చింది. 77 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా థర్డ్‌ లో నిలిచింది. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్షల్లో బాలుర కంటే బాలికలదే పైచేయిగా నిలిచింది.

ఇంటర్ ఫస్టియర్ లో బాలురు 58%, బాలికలు 65 % ఉత్తీర్ణత సాధించగా ఇంటర్ సెకండియర్ లో బాలురు 68% , బాలికలు 75% ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలపై రీవెరిఫికేషన్ కి మే 6 లోపు అప్లై చేసుకోవాలని మంత్రి బొత్స తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి. ప్రాక్టికల్స్ మే 6 నుంచి జూన్ 9 వరకు జరుగుతాయి. మే 3 లోపు సప్లిమెంటరీ పరీక్షలకి ఫీజు చెల్లించుకోవాలి. విజయనగరం జిల్లాలో ఫలితాలు తగ్గడంపై సమీక్షిస్తామని మంత్రి తెలిపారు. ఫలితాలను examresults.ap.nic.in, www.bie.ap.gov.in, మనబడి సైట్‌ల్లో కూడా మీ రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు.