Vijayawada, April 26: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు (AP Inter Results) విడుదల అయ్యాయి. విజయవాడలో సాయంత్రం 6.40 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల (AP Inter Results) చేశారు. వృత్తి విద్య కోర్సుల పరీక్ష ఫలితాలను కూడా వెల్లడించారు. ఈ ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన పరీక్షలకు 9,20,552 మంది, వృత్తి విద్య కోర్సు పరీక్షలకు 83,749 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,489 కేంద్రాల్లో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వరకు విద్యార్థులు పరీక్షలు రాశారు.
ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాలు ఒకేసారి విడుదల అయ్యాయి. ఇటీవల సంవత్సరాల్లో ఇలా ఒకేసారి ఫస్ట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం ఇదే మొదటిసారి. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 15వ తేదీన ప్రథమ సంవత్సరం, 16వ తేదీన ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమై.. ఏప్రిల్ 4వ తేదీన ముగిసిన విషయం తెలిసిందే. కేవలం 22 రోజుల వ్యవధిలో ఫలితాలను ఇంటర్ బోర్డు ప్రకటించింది.విద్యార్థులు bieap.apcfss.in, bie.ap.gov.in అధికారిక వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇతర వెబ్ సైట్ లలోను ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.