IPL Auction 2025 Live

AP LAWCET Result 2021: ఏపీ లాసెట్‌–2021 ఫలితాలు విడుదల, మూడు కోర్సుల్లోనూ మహిళలే మొదటి ర్యాంకులు, నేటి నుంచి ఏపీ పీజీసెట్‌–2021 పరీక్షలు

తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఏపీ లాసెట్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే.

Exams Representational Image. |(Photo Credits: PTI)

ఏపీలో న్యాయ కళాశాలల్లో 3, 5 ఏళ్ల ఎల్‌ఎల్‌ బీ, 2 ఏళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి గ త నెల 22న నిర్వహించిన ఏపీ లాసెట్‌–2021 ఫలితాలను (AP LAWCET Result 2021) ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి తిరుపతిలో గురువారం విడుదల చేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఏపీ లాసెట్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మూడు కోర్సుల్లోనూ మహిళలే మొదటి ర్యాంకులు సాధిం చారని తెలిపారు. వర్సిటీ వీసీ డి.జమున, లాసెట్‌ కన్వీనర్‌ చంద్రకళ, రెక్టార్‌ డి.శారద, రిజిస్ట్రార్‌ మమత పాల్గొన్నారు.

మూడేళ్ల ఎల్‌ఎల్‌బీలో (3 Years LLB) మోపూరు హరిప్రియ (విజయవాడ రూరల్‌) మొదటి ర్యాంకు పొందారు. ఏపీ ట్రాన్స్‌కోలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మోపూరు హరిప్రియ 53 ఏళ్ల వయసులో ఈ ర్యాంక్‌ సాధించడం విశేషం ఎల్‌.రాజా (గుంటూరు) రెండో ర్యాంకు, కె.హరికృష్ణ (అనంతపురం) మూడో ర్యాంకు సాధించారు. ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీకి (5 Years LLB) సంబంధించి ఎం.మౌనిక బాయి (బనగానపల్లె, కర్నూలు జిల్లా) మొదటి ర్యాంకు పొందారు. వి.నాగసాయి ప్రశాంతి (రణస్థలం, శ్రీకాకుళం జిల్లా) రెండో ర్యాంకు, సునీల్‌ (పూసపాటిరేగ, విజయనగరం జిల్లా) మూడో ర్యాంకు సాధించారు. ఇక రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం ప్రవేశపరీక్షలో వై.గీతిక (విశాఖపట్నం) మొదటి ర్యాంకు పొందారు. కె.కృష్ణమ నాయుడు (ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా) రెండో ర్యాంకు, టి.రమేష్‌ బాబు (విజయవాడ) మూడో ర్యాంకు సాధించారు.

ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల, ఫలితాలను sche.ap.gov.in, మనబడి ద్వారా చెక్ చేసుకోండి, ర్యాంక్ కార్డులను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే దానిపై పూర్తి సమాచారం మీకోసం

రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఏపీ పీజీసెట్‌–2021కు (AP PG CET) సర్వం సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి 26 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో ప్రవేశపరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ పీజీసెట్‌ కన్వీనర్‌ ఆచార్య వై.నజీర్‌ అహ్మద్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 43,632 సీట్లకు పీజీసెట్‌ నిర్వహిస్తున్నామన్నారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 42,082 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల కేంద్రాలు, ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్‌లో సైతం పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 20 ప్రాంతాల్లో 53 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షలకు హాజరుకావాలని కోరారు.

How To Download AP LAWCET 2021 Result

Go to the official website.

Click on the link for result or rank card.

Login with hall ticket number, registration number and date of birth.

Download the rank card or view result.

Take a printout of the rank card for later use.

AP LAWCET 2021 result direct link



సంబంధిత వార్తలు