Telangana: పదో తరగతి విద్యార్థులకు తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి చేసిన తెలంగాణ ప్రభుత్వం, జీవో 15ను అమలు చేయాలని అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు

ఇందుకు అనుగుణంగా ఆదేశాలు జారీ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) తెలంగాణ యాక్ట్, 2018ను గతంలోనే తీసుకొచ్చింది.

School students. Credits: PTI

Hyd, june 15: తెలంగాణలోని పదో తరగతి విద్యార్థులు ఈ ఏడాది నుంచి తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా చదవాల్సిందే. ఇందుకు అనుగుణంగా ఆదేశాలు జారీ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) తెలంగాణ యాక్ట్, 2018ను గతంలోనే తీసుకొచ్చింది. దీని కింద ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు తెలుగును ఒక సబ్జెక్ట్ గా తప్పనిసరిగా (Telugu Subject Compulsory) ఎంపిక చేసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కాకపోతే పదో తరగతి విద్యార్థులకు అప్పట్లో మినహాయింపు ఇచ్చారు.

తాజాగా పదో తరగతి విద్యార్థులు ఏ బోర్డు (సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, స్టేట్) పరిధిలో (Class 1 to 10 of CBSE, ICSE, IB Schools) చదివినా తెలుగును ఎంపిక చేసుకోవాల్సిందే. ఇందుకు సంబంధించిన ఆదేశాలను పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ జారీ చేశారు. పదో తరగతిలో తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్ గా అమలుకు వీలుగా జీవో 15ను జారీ చేస్తూ, దీన్ని అమలు చేయాలని అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులను ఆదేశించారు.

తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం, నేటి నుంచి ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలు, కొత్త పుస్తకాలు, యూనిఫాంలు ఇప్పట్లో లేనట్లే

తెలుగు అమలు చేయడంలో విఫలమైతే ఆయా పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే ఈ ఆదేశాలు ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, ఐబీ బోర్డుల ప్రతినిధులను అయోమయానికి గురి చేశాయి. పదో తరగతి పరీక్షలను దేశవ్యాప్తంగా కేంద్రీకృత విధానంలో నిర్వహిస్తారు కనుక, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను ఎలా అమలు చేయాలి? అంటూ మల్లగుల్లాలు పడుతున్నారు.