UGC New Announcement: డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రద్దు చేయడం కుదరదు, తప్పనిసరిగా పరీక్షల నిర్వహించాల్సిందే, స్పష్టం చేసిన యూజీసీ సెక్రటరీ రజనీష్ జైన్
అన్ని రాష్ట్రాలు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాల్సిందేనని యూజీసీ (University Grant Commission) సెక్రటరీ తాజాగా స్పష్టం చేశారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశామని చెప్పారు. యూనివర్సిటీలు, కళాశాలలు ఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్‌లో గానీ పరీక్షలు నిర్వహించుకోవచ్చని యూజీసీ సెక్రటరీ ప్రొఫెసర్ రజనీష్ జైన్ (Rajnish Jain) తెలిపారు.కేంద్ర వైద్యఆరోగ్య శాఖ ( Health Ministry) మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలని చెప్పారు.
New Delhi, July 9: యూజీ, పీజీ కోర్సులతోపాటు ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు (Final Year Exams 2020) సంబంధించి మరోమారు యూజీసీ సెక్రటరీ కీలక ప్రకటన చేశారు. అన్ని రాష్ట్రాలు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాల్సిందేనని యూజీసీ (University Grant Commission) సెక్రటరీ తాజాగా స్పష్టం చేశారు. భారత్‌లో రోజుకు 2.87లక్షల కొత్తకేసులు నమోదవుతాయంటున్న అధ్యయనం, మహారాష్ట్రలో మొత్తం 5,713 మంది పోలీసులకు కరోనా, దేశంలో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 24,879 కోవిడ్-19 కేసులు
ఇప్పటికే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశామని చెప్పారు. యూనివర్సిటీలు, కళాశాలలు ఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్‌లో గానీ పరీక్షలు నిర్వహించుకోవచ్చని యూజీసీ సెక్రటరీ ప్రొఫెసర్ రజనీష్ జైన్ (Rajnish Jain) తెలిపారు.కేంద్ర వైద్యఆరోగ్య శాఖ ( Health Ministry) మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలని చెప్పారు.
Here What He said
యూజీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలు సెప్టెంబర్‌లోగా నిర్వహించాలన్న యూజీసీ నిర్ణయంపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చివరి సంవత్సరం/సెమిస్టర్ పరీక్షలను రద్దు చేసి గత సెమిస్టర్‌ల మార్కుల సరాసరి ఆధారంగా పాస్ చేయాలని కోరుతున్నారు. తర్వాత కావాలంటే బెటర్‌మెంట్ మార్కుల కోసం పరీక్షలు పెట్టి రాసుకునే వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.
మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో పరీక్షలను ఐచ్ఛికంగా తీసుకుని ప్రభుత్వం తీర్మానం చేసిన తర్వాత చాలామంది ఉపశమనం పొందారు. ఇప్పుడు యూజీసీ నిర్ణయంపై ఆందోళన చెందుతున్నారు. యూజీసీ నిబంధనలు కేవలం మార్గదర్శకాలేనని, అవి తప్పనిసరి కావని అంటున్నారు. ఐఐటీలు, ఎన్‌ఐటీలు పరీక్షలను రద్దు చేసినప్పుడు ఇక్కడ ఎందుకు చేయరని కొందరు ప్రశ్నిస్తున్నారు.