Coronavirus in India: భారత్‌లో రోజుకు 2.87లక్షల కొత్తకేసులు నమోదవుతాయంటున్న అధ్యయనం, మహారాష్ట్రలో మొత్తం 5,713 మంది పోలీసులకు కరోనా, దేశంలో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 24,879 కోవిడ్-19 కేసులు
Coronavirus in India (Photo-PTI)

New Delhi, July 9: ఇండియాలో గ‌త 24 గంట‌ల్లో అత్య‌ధికంగా 24,879 మందికి క‌రోనా వైర‌స్ (Coronavirus in India) సంక్ర‌మించింది. 487 మంది మ‌ర‌ణించారు. దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల 7,67,296కు చేరుకున్న‌ది. మొత్తం యాక్టివ్ కేసులు 269789 ఉన్నాయి. వైర‌స్ నుంచి 476378 మంది కోలుకున్నారు. దేశ‌వ్యాప్తంగా వైర‌స్ (India Coronavirus) వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 21129గా (coronavirus deaths) ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. మానవత్వాన్ని చంపేసిన కరోనా, అందరూ చూస్తుండగానే నడిరోడ్డు మీద యువకుడు మృతి, ఎవరూ సాయం చేయని వైనం, ఈసీఐఎల్ చౌరస్తాలో హృదయవిదారక ఘటన

మహారాష్ట్ర కరోనా (Maharashtra Coronavirus) ఇప్పటి వరకు 2లక్షలకుపైగా కేసులు నమోదు కాగా, బుధవారం ఒకే రోజు 6603 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కేసుల సంఖ్య 2,23,724కు చేరగా.. 1,23,192 మంది కోలుకొని డిశ్చారి అయ్యారు. ఇవాళ ఒక్క రోజే వైరస్‌ ప్రభావంతో 198 మంది చనిపోగా, మృతుల సంఖ్య 9,448కు చేరింది. ప్రస్తుతం మరో 91,065 మంది చికిత్స పొందుతున్నారని ఆరోగ్యశాఖ బులిటెన్‌లో వివరించింది. మహారాష్ట్రలో గత 48 గంటల్లో ఆ రాష్ట్రంలోని 298 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా (Coronavirus Cases) తేలినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ మహమ్మారి బారిన పడిన పోలీసుల సంఖ్య 5,713కు చేరుకుంది. ప్రస్తుతం ఇందులో 1,113 యాక్టివ్‌ కేసులున్నాయి. 4,275 మంది కోలుకున్నారు. 71మంది సిబ్బంది మృతిచెందారు. కరోనా శవాన్ని పీక్కుతింటున్న కుక్క, హైదరాబాద్ నగరం నుంచి ఒళ్లు గగుర్పొడిచే వీడియో బయటకు, సనత్ నగర్ శ్మశానవాటికలో అమానవీయ ఘటన

కరోనా వైరస్‌ నిర్మూలనకు 2021 చలికాలం నాటికి కూడా వ్యాక్సిన్‌గానీ, ఔషధంగానీ అందుబాటులోకి రాకుంటే భారత్‌లో రోజూ సగటున 2.87లక్షల కొత్తకేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) నిర్వహించిన ఓ అధ్యయనం హెచ్చరించింది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య, టెస్టుల సంఖ్య, ప్రభుత్వ నిర్ణయాలు తదితర వివరాలను సేకరించి ఈ అధ్యయనం నిర్వహించారు. కరోనా కేసుల్లో భారత్‌ తర్వాత అమెరికా, దక్షిణాఫ్రికా, ఇరాన్‌ ఉంటాయని వెల్లడించారు. హోం క్వారంటైన్‌లోకి జార్ఖండ్‌ ముఖ్యమంత్రి‌, సీఎం హేమంత్‌ సోరెన్ నివాసానికి వెళ్లే మార్గాలన్నీ మూసివేత

ఇదిలా ఉంటే కరోనాతో పలు రకాలైన నాడీ సంబంధ సమస్యలు కూడా ఎదురవుతాయని లండన్‌లో యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌(యూసీఎల్‌) పరిశోధకులు తాజాగా గుర్తించారు. ముఖ్యంగా మెదడులో మంటతో పాటు, డెలిరియం, మెదడుకు స్ట్రోక్‌ వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశముందని పేర్కొన్నారు. వైరస్‌ సరాసరి మెదడుపై దాడి చేయనప్పటికీ.. పరోక్షంగా మెదడుపై దాడి జరుగుతున్నట్లు గుర్తించామని పరిశోధకులు తెలిపారు. ఈ మేరకు తమ పరిశోధనల వివరాలను ‘బ్రెయిన్‌’ పత్రికలో ప్రచురించారు.

దాని ప్రకారం.. అత్యంత అరుదైన, మెదడులో మంట పుట్టించే ఏడీఈఎం అనే అనారోగ్యం, కరోనా వచ్చిన వారిలో పెరుగుతోంది. ఒకప్పుడు నెలకు ఒక రోగి మాత్రమే ఈ అరుదైన పరిస్థితితో వైద్యులను సంప్రదిస్తే.. కరోనా విజృంభణ అనంతరం వారానికి ఒకరు దీని బాధితులుగా మారుతున్నారు. కరోనా సోకిన 43మంది రోగుల నాడీ వ్యవస్థ ల్ని పరిశోధించిన మీదట, వారిలో చాలామందిలో శ్వాస సంబంధిత సమస్య కంటే, నాడీ సంబంధిత రుగ్మతలే ఎక్కువగా కనిపించాయి. అయితే.. కరోనా వల్ల ఆ స్థాయిలో మెడదు సమస్యలు తలెత్తుతాయని ఇప్పుడే చెప్పలేమని పరిశోధకులు స్పష్టం చేశారు.