
Ranchi, July 8: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Jharkhand CM Hemant Soren) బుధవారం హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. పార్టీ ఎమ్మెల్యే మథుర మహతో , రాష్ట్ర మంత్రి మిథిలేష్ ఠాకూర్‌లకు (Mithlesh Thakur) కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సీఎం తనకు తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యే కరోనా వైరస్‌తో (COVID-19) బాధపడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ముందుజాగ్రత్త చర్యగా తాను బుధవారం నుంచి కొన్నిరోజులు స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నానని సీఎం హేమంత్ సోరెన్ ట్వీట్ చేశారు. ఇరవై వేలు దాటిన కరోనా మరణాలు, గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 22,752 కోవిడ్-19 కేసులు నమోదు, దేశంలో 7,42,417కి చేరిన మొత్తం కరోనా కేసుల సంఖ్య
తన కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బంది అందరూ హోం క్వారంటైన్‌కు వెళ్లాలని ఆయన కోరారు. ముఖ్యమైన పనులను తాను ఇంటినుంచే నిర్వర్తిస్తానని చెప్పారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లోకి రావడం మానుకోవాలని, అత్యవసరమైతే మాస్క్‌లు ధరించే బయటకు రావాలని కోరారు. సీఎం సోరెన్ నివాసానికి వెళ్లే మార్గాలను అధికారులు మూసివేశారు.
Here's Jharkhand CM Hemant Soren Tweet
साथियों,
कैबिनेट के मेरे साथी मंत्री श्री मिथिलेश ठाकुर जी एवं हमारे दल के विधायक आदरणीय श्री मथुरा महतो जी कोरोना संक्रमित पाये गए हैं।
दोनो साथी अभी सरकारी अस्पताल में इलाजरत हैं। एहतियात के तौर पर आज से अगले कुछ दिनो के लिए मैं भी self- isolation में रहूँगा, पर 1/2
— Hemant Soren (घर में रहें - सुरक्षित रहें) (@HemantSorenJMM) July 8, 2020
జార్ఖండ్ లో ఇప్పటి వరకు 3,056 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 930 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ వైరస్ నుంచి 2,104 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 22,752 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి బారినపడి ఒక్కరోజే 482 మంది మరణించారు