Group-4 Exam Today: గ్రూప్‌-4 పరీక్ష నేడే.. 15 నిమిషాల ముందే గేట్లు బంద్‌.. ఈ జాగ్రత్తలు మరిచిపోకండి!

శనివారం పరీక్షకు అభ్యర్థులు బూట్లు ధరించి వస్తే అనుమతించబోమని, చెప్పులు వేసుకొని రావాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. వాచ్‌, హ్యాండ్‌ బ్యాగ్‌, పర్సులను పరీక్ష హాలులోకి తీసుకెళ్లకూడదని తెలిపింది.

Representational Image (File Photo)

Hyderabad, July 1: అభ్యర్థులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న గ్రూప్‌-4 (Group-4)కు సర్వం సిద్ధమైంది. శనివారం పరీక్షకు అభ్యర్థులు బూట్లు (Shoes) ధరించి వస్తే అనుమతించబోమని, చెప్పులు వేసుకొని రావాలని టీఎస్‌పీఎస్సీ (TSPSC) సూచించింది. వాచ్‌ (Watch), హ్యాండ్‌ బ్యాగ్‌ (Hand Bag), పర్సులను పరీక్ష హాలులోకి తీసుకెళ్లకూడదని తెలిపింది. పరీక్ష కేంద్రాల్లోని పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని వివరించింది. పరీక్షకు 15 నిమిషాల ముందే గేటు మూసివేస్తారని, ఆరు పద్ధతుల్లో అభ్యర్థులను తనిఖీ చేస్తారని వెల్లడించింది.

Maharashtra Accident: మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం.. మంటలు చెలరేగి 25 మంది సజీవ దహనం.. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఘటన.. గాయపడిన 8 మంది పరిస్థితి కూడా విషమం

నిర్వహణ ఇలా..

గ్రూప్‌-4 పరీక్ష రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో జరిగే పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కమిషన్‌ పేర్కొన్నది. 8,039 గ్రూప్‌4 ఉద్యోగాలకు 9,51,205 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నట్టు తెలిపింది. శుక్రవారం రాత్రి వరకు 9,01,051 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు పొందారని వెల్లడించింది.

Lingamaneni Guest House Attachment: చంద్రబాబు ఇంటి జప్తుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు, ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలన్న కోర్టు, చంద్రబాబుకు కేసుతో సంబంధమేంటని టీడీపీ ప్రశ్న