Lingamaneni Guest House Attachment: చంద్రబాబు ఇంటి జప్తుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు, ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలన్న కోర్టు, చంద్రబాబుకు కేసుతో సంబంధమేంటని టీడీపీ ప్రశ్న
Lingamaneni Guest House Attachment (PIC@ FB)

Vijayawada, June 30: విజయవాడలో కరకట్ట మీదున్న లింగమనేని నివాసం (Lingamaneni Guest House) జప్తుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. జప్తు చేయటానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏపీ సీఐడీ (AP CID) దాఖలు చేసిన పిటిషన్ కు అనుమతి ఇచ్చింది. లింగమనేని రమేశ్ తో పాటు మిగతా ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని చెప్పింది. గెస్ట్ హౌస్ ను జప్తు చేయడంతో పాటు నారాయణ ఆస్తులను పాక్షికంగా జప్తు చేసేందుకు అనుమతి మంజూరు చేసింది ఏసీబీ కోర్టు (ACB Court). అయితే లింగమనేని ఆస్తులపై ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుతో చంద్రబాబుకి ఏం సంబంధం అని టీడీపీ నేత బోండా ఉమ ప్రశ్నించారు. లేని ఇన్నర్ రింగ్ రోడ్డు ద్వారా చంద్రబాబు ఎలా లబ్ది పొందుతారని ఆయన ప్రశ్నించారు. న్యాయస్థానాన్ని వైసీపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆయన అన్నారు.

CM Jagan Full Speech in Kurupam: దత్తపుత్రుడిలా నలుగురిని పెళ్లి చేసుకుని భార్యను మార్చలేం, ఆ నాలుగు కోతులంటూ ప్రతిపక్షాలపై మండిపడిన సీఎం జగన్ 

ఉండవల్లిలోని తాను ఉంటున్న ఇంటికి చంద్రబాబు (Chandrababu) అద్దె చెల్లిస్తున్నారని, దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఇప్పటికే చూపించినట్లు బోండా ఉమ చెప్పారు. ఉన్నత న్యాయస్థానంలో ప్రభుత్వానికి పరాభవం తప్పదన్నారు బోండా ఉమ. లింగమనేని రమేశ్ భూములు పక్క నుంచి వెళ్లేందుకు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్చారు. కాబట్టి ఆయన ప్రాపర్టీని అటాచ్ చేసేందుకు అనుమతి కోరింది. వాస్తవాలు ఎలాగున్నా ముందు అటాచ్ మెంట్ చేయమని కోర్టు చెప్పి ఉండొచ్చు. కానీ, తెలుగుదేశం పార్టీకి ఆ ఇష్యూకి సంబంధమే లేదు. లింగమనేని రమేశ్ ఇంటిని చంద్రబాబు అద్దెకు తీసుకున్నారు. అద్దె కూడా చెల్లిస్తున్నారని చెప్పారు.

Hyderabad: వీడియో ఇదిగో, అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ సిబ్బందిని చితకబాదిన నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు 

ఇంకా బోండా ఉమ ఏమన్నారంటే...అసలు ప్రభుత్వమే ఈ కేసులో న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తోంది. ఎందుకు పట్టింస్తోంది అంటే.. లేని ఇన్నర్ రింగ్ రోడ్డుని ఉన్నట్లుగా చూపించారు. క్విడ్ ప్రోకో ఎవరు? రూ.43వేల కోట్లు కొట్టేసి వాళ్లకి లక్ష కోట్ల లబ్ది చేకూర్చడం నీది క్విడ్ ప్రోకో. ఇక్కడసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు. లేని ఇన్నర్ రింగ్ రోడ్డు ఉన్నట్లు కాగితాల మీద చూపించి ఏసీబీ కోర్టులో నువ్వు స్టే తెచ్చుకున్నోడివి దీన్ని క్విడ్ ప్రో కో అనడంలో అసలు అర్థమే లేదు.

Andhra Pradesh Blast: అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం, ఏడుగురి పరిస్థితి విషమం, 60 నుంచి 70 శాతం వరకు శరీరం కాలిపోయిందని తెలిపిన డాక్టర్లు 

కాగా, క్విడ్ ప్రో కోలో భాగంగా లింగమనేని రమేశ్ గెస్ట్ హౌస్ ను చంద్రబాబు పొందారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఆదేశాలతో ఏపీ సీఐడీ విచారణ జరిపింది. ఏసీబీ కోర్టులో అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించింది. విచారణ చేసిన కోర్టు.. క్విడ్ ప్రో కోలో భాగంగానే చంద్రబాబు (Chandrababu) లింగమనేని గెస్ట్ హౌస్ పొందారని ధృవీకరించింది.