YS Jagan (Photo-Video Grab)

Kurupam, June 28: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో నిర్వహించిన జగనన్న అమ్మ ఒడి నిధుల విడుదల కార్యక్రమ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నన్ను గుండెల్లో పెట్టుకున్న ప్రతీ ఒక్కరికి నిండు మనసుతో.. హృదయపూర్వక కృతజ్ఞతలంటూ ఆయన తన ప్రసంగం ప్రారంభించారు. ప్రపంచాన్ని ఏలే పరిస్థితికి మన పిల్లలు రావాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. ఇందులో భాగంగా పదిరోజులపాటు పండుగలా జగనన్న అమ్మ ఒడి నిర్వహిస్తాం అని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

తల్లులు తమ పిల్లలను బడులకు పంపేందుకు అమ్మ ఒడి పథకం తీసుకొచ్చాం. ఈ నాలుగేళ్లలో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో.. క్లాస్‌ టీచర్లకే గతిలేని పరిస్థితి గతంలో చూశాం. ఇప్పుడు మూడో తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్లు ఉండేలా చేస్తున్నాం. మన పిల్లలు గ్లోబల్‌ సిటిజన్స్‌గా తయారు కావాలి అని సీఎం జగన్‌ వేదిక నుంచి ఆకాంక్షించారు. మూడో తరగతి నుంచే టోఫెల్‌ కరికులమ్‌ తీసుకొస్తున్నాం. ఆరో తరగతి నుంచే క్లాస్‌ను డిజిటలైజ్‌ చేస్తున్నాం అని తెలిపారు.

జగనన్న అమ్మ ఒడి నిధులు విడుదల, ఈ ఏడాది రూ.6,392.94 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన జగన్ సర్కారు, 4 ఏళ్లలో రూ. 26,067.28 కోట్ల విడుదల

పెత్తందార్లకే అందుబాటులో ఉన్న చదువులు .. ఇప్పుడు పేదలకు కూడా అందుబాటులోకి వచ్చాయన్నారు సీఎం వైఎస్‌ జగన్‌. ఈ క్రమంలో గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని క్షమించగలమా? అని ప్రశ్నించారాయన. పెత్తందారీ విద్యావిధానాన్ని బద్ధలు కొట్టి.. అన్నివర్గాలకు ఉన్నతవిద్యను అందిస్తున్నామన్నారు. పేదల కుటుంబాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వ బడులని తీర్చిదిద్దాం. ప్రైవేట్‌ బడులతో ప్రభుత్వ బడులు పోటీపడే పరిస్థితికి చేరుకుంది. చదువుల్లో అంటరానితనాన్ని రూపుమాపాం. ప్రభుత్వ బడుల్లోనూ వజ్రాలు, రత్నాల్లాంటి పిల్లలు ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని సీఎం జగన్ తెలిపారు.

ప్రతిపక్షాలపై మండిపడిన ఏపీ ముఖ్యమంత్రి

ప్రజలకు ఇంత మంచి చేస్తుంటే.. చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని, అబద్ధాలు.. మోసాలతో మళ్లీ ప్రజలను మభ్యపెట్టేందుకు వస్తున్నాడని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జగనన్న అమ్మ ఒడి పథకం నిధుల విడుదల కార్యక్రమంలో గభాంగా.. కురుపాం బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్‌ కల్యాణ్‌పైనా మండిపడ్డారు.తన 45 ఏళ్ల రాజకీయంలో చంద్రబాబు ఏనాడూ మంచి గురించి ఆలోచించలేదు. టీడీపీని టీ అంటే తినుకో.. డీ అంటే దండుకో.. పీ అంటే పంచుకోగా మార్చేశారు. దోచుకున్న సొమ్ముతో వాళ్లు బొజ్జలు పెంచుకున్నారని ఎద్దేవా చేశారాయన.

మేకపాటి కుటుంబానికే ఉదయగిరి టికెట్, రాజగోపాల్ రెడ్డిని వైసీపీ ఇన్‌చార్జ్‌గా ప్రకటించిన అధిష్ఠానం, చంద్రశేఖర్ రెడ్డికి చెక్ పెట్టేలా వ్యూహం

మన రాష్ట్రంలో మంచిచేయొద్దని చెప్పే నాలుగు కోతులు ఉన్నాయి. మంచి అనోద్దు.. మంచి వినోద్దు..మంచి చేయొద్దు అన్నదే వారి విధానం. నమ్మించి ప్రజలను నట్టేటా ముంచడమే వాళ్లకు తెలిసిన నీతి. రాష్ట్రంలో మంచి జరుగుతుంటే భరించలేకపోతున్నారు. వాళ్లకు కడుపులో మంట, ఈర్ష్యతో వాళ్లకు కళ్లు మూసుకుపోయాయి.

దత్తపుత్రుడు 2014లోనూ చంద్రబాబుకు మద్దతు ఇచ్చాడు. మరి ఆ తర్వాత చంద్రబాబు చేసిన మోసాన్ని ఎందుకు నిలదీయలేదు. ఆ దత్తపుత్రుడు.. మామూలుగా మాట్లాడడు. ఆ ప్యాకేజీ స్టార్‌ వారాహి అనే ఓ లారీ ఎక్కి ఊగిపోతూ తనకు నచ్చనివారిని.. చెప్పుతో కొడతానంటాడు. తాట తీస్తానంటాడు. ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. ఆ మనిషి నోటికి అదుపు లేదు.. నిలకడా లేదు. వారిలా నలుగురిని పెళ్లి చేసుకుని భార్యను మార్చలేం. దత్తపుత్రుడిలా తొడలు కొట్టలేం.. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ బూతులు తిట్టలేం. అవన్నీ వారికి చెందిన పేటెంట్‌.

దుష్టచతుష్టయం సమాజాన్ని చీల్చుతోంది. కానీ, మన పునాదులు సామాజిక న్యాయంలో ఉన్నాయి. అందుకే పనికి మాలిని పంచ్‌ డైలాగులు ఉండవ్‌. బలమైన, పటిష్టమైన పునాదుల మీద నిలబడ్డాం. పౌర సేవలు, సంక్షేమ పథకాల అమలులో మన పునాదులు ఉన్నాయి. పేదల కష్టాల నుంచి మన పునాదులు పుట్టాయి. మన పునాదులు ఓదార్పు యాత్ర నుంచి పుట్టాయి.

వైఎస్సార్‌ లా నేస్తం నిధులు విడుదల చేసిన ఏపీ సీఎం జగన్, 2,677 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5 వేల స్టైఫండ్‌

వాళ్ల మాదిరిగా వెన్నుపోటు, అబద్ధాలపై మన పునాదులు పుట్టలేదు. రాష్ట్రంలో రాక్షసులతో మనం యుద్ధం చేస్తున్నాం. యుద్ధంలో వారి మాదిరిగా మనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లేవు. వారి మాదిరిగా మనకు దత్తపుత్రుడు లేడు. అబద్ధాలను పదే పదే చెప్పి భ్రమ కలిగించే మీడియా మనకు లేదు.

మీ బిడ్డ పొత్తుల కోసం ఏరోజూ పాకులాడలేదు. రాష్ట్రంలో రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం. మీ బిడ్డ తోడేళ్లను నమ్ముకోలేదు.. దత్తపుత్రుడిని నమ్ముకోలేదు. జరగబోయే కురుక్షేత్రంలో మీ బిడ్డకు మీరే అండ. మీ బిడ్డకు అండగా ఉన్నది ఆ భగవంతుడు.. ప్రజలు మాత్రమే. మీకు మంచి చేశాను అనిపిస్తేనే ఈ యుద్ధంలో మీరే నాకు అండగా నిలవాలి అని కోరారాయన.