Sankranthi Holidays in AP: ఏపీలో 8 రోజుల పాటు సంక్రాంతి సెలవులు, జనవరి 11 న అమ్మ ఒడి రెండవ విడత కార్యక్రమం, విద్యారంగంలో ఏపీని నంబర్ వన్‌గా నిలుపుతామని తెలిపిన విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్

రాష్ట్రంలో ఆరు రోజుల పాటు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ నెల 12 నుంచి 17 వరకు సెలవులు ఉండనున్నట్లు పేర్కొంది. 9న రెండవ శనివారం...10వ తేదీ ఆదివారం కావడంతో మరో రెండు రోజులు సెలవులు (Sankranthi Holidays in AP) కలిసిరానున్నాయి. దీంతో మొత్తం 8 రోజులు సెలవులు వచ్చాయి.

AP Educational minister Adimulapu Suresh (Photo-Twitter)

Amaravati, Jan 5: ఆంధప్రదేశ్‌లో సంక్రాంతి సెలవుల తేదీలను ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. రాష్ట్రంలో ఆరు రోజుల పాటు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ నెల 12 నుంచి 17 వరకు సెలవులు ఉండనున్నట్లు పేర్కొంది. 9న రెండవ శనివారం...10వ తేదీ ఆదివారం కావడంతో మరో రెండు రోజులు సెలవులు (Sankranthi Holidays in AP) కలిసిరానున్నాయి. దీంతో మొత్తం 8 రోజులు సెలవులు వచ్చాయి.

16న సెలవు ఇస్తున్నందున 9న రెండో శనివారం స్కూల్స్ నిర్వహిస్తారు. 11, 12న ఇస్తున్న సెలవులకు (Sankranti holidays in AP 2021) ఏదో ఒక నెలలో వారం రోజులు అదనంగా ఒక గంట పాఠశాల నిర్వహించాలి…. ప్రస్తుతం మధ్యాహ్న 1.30 గంటలకు పాఠశాలలు ముగుస్తున్నందున అదనంగా 2.30 గంటల వరకు వారం రోజులు పని చేయాల్సి ఉంటుంది. 11న అమ్మ ఒడి రెండో విడత నగదు పంపిణీ (Amma Vodi) కారణంగా విద్యా శాఖ పనిచేయనుంది.

రాష్ట్రంలోని యూనివర్సిటీల బలోపేతానికి ప్రాధాన్యతనిస్తున్నామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ (Education Minister Dr. Adimulku Suresh) తెలిపారు. ప్రతీ యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. తొమ్మిది యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్లని నియమించామని, మూడు యూనివర్సిటీలకి సెర్చ్ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. విద్యా సంస్ధలలో రాజకీయ జోక్యం లేకుండా ఉత్తమ ఫలితాల దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశామని పేర్కొన్నారు.

సోము వీర్రాజు అరెస్ట్, రామతీర్థంలో సెక్షన్‌ 30 అమల్లోకి, ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పని సరి, రాముని విగ్రహ ధ్వంసం ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం

మంగళవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి సురేష్‌ మాట్లాడుతూ.. ఉన్నత విద్యలో అర్హులకి పూర్తిస్ధాయి ఫీజు రీఎంబర్స్ మెంట్ చెల్లిస్తున్నామన్నారు. ఈ నెల 11 న అమ్మ ఒడి రెండవ విడత కార్యక్రమం ప్రాంభిస్తున్నట్లు చెప్పారు. నాడు నేడులో మూడు విడతలలో 11 వేల‌కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నామని, దేశంలో ఎక్కడాలేని విధంగా హైయర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు ఏర్పాటు చేశామన్నారు.

ఈ దుర్మార్గులు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, తప్పు ఎవరు చేసినా వదిలేది లేదు, అబద్దపు ప్రచారాలు మానుకోవాలి, పోలీస్ డ్యూటీ మీట్ ప్రారంభించిన ఏపీ సీఎం వైయస్ జగన్, ప్రతిపక్షాలపై తీరుపై ఆగ్రహం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఉన్నత విద్యను బలోపేతం చేస్తున్నాం. నిబంధనలు‌ పాటించని 247 కళాశాలలకి షోకాజ్ నోటీసులు ఇచ్చాం. 48 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలపై చర్యలు తీసుకున్నాం. నాణ్యతా ప్రమాణాలు పాటించని‌ కళాశాలలపై చర్యలుంటాయి. ఈ నూతన విద్యా సంవత్సరంలో ఆన్ లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాం. ఇంటర్‌లో వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్ అడ్మిషన్లు ప్రారంభిస్తాం.అవినీతికి తావులేకుండా యూనివర్సిటీలలో పూర్తిగా కంప్యూటీకరణ చేస్తున్నాం.

ఉన్నత విద్యలో ర్యాపిడ్ ఎడ్యుకేషన్ సర్వే నిర్వహిస్తున్నాం. ఈ విద్యాసంవత్సరంలో మూడు కొత్త కోర్సులు ప్రారంభిస్తున్నాం. అయిదేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుని ప్రారంభిస్తున్నాం.నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ‌ కోర్సుని తీసుకువస్తున్నాం. నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోసం ఒక ఏడాది పిజి‌కోర్సుని కొత్తగా ప్రవేశపెడుతున్నాం. ఈ ఏడాదిలో ఉన్నత విద్యామండలిని మరింత బలోపేతం చేసి దేశంలో నంబర్ వన్‌గా నిలబడతాం’ అని విద్యాశాఖ మంత్రి అన్నారు.