Half-Day Schools in TS: తెలంగాణ‌లో రేప‌ట్నుంచి ఒంటిపూట బ‌డులు, ఉద‌యం 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల వ‌ర‌కు కొనసాగనున్న స్కూల్స్

అన్ని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల్లో మంగ‌ళ‌వారం నుంచి ఒంటిపూట బ‌డులు (Half-Day Schools in TS) నిర్వ‌హించాల‌ని స్కూల్ ఎడ్యుకేష‌న్ డైరెక్ట‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

School Student (Representational Image (Photo Credits: Pixabay)

Hyd, Mar14: తెలంగాణ‌లో రేప‌ట్నుంచి ఒంటిపూట బ‌డులు ప్రారంభం కానున్నాయి. అన్ని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల్లో మంగ‌ళ‌వారం నుంచి ఒంటిపూట బ‌డులు (Half-Day Schools in TS) నిర్వ‌హించాల‌ని స్కూల్ ఎడ్యుకేష‌న్ డైరెక్ట‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఉద‌యం 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల వ‌ర‌కు ఒంటిపూట బ‌డులు ( Telangana Half Day Schools 2022 ) కొన‌సాగ‌నున్నాయి. మ‌. 12:30 గంట‌ల‌కు మ‌ధ్యాహ్నం భోజ‌నం పెట్టి, విద్యార్థుల‌ను ఇంటికి పంప‌నున్నారు. ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు కొన‌సాగుతాయ‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

యువ‌త‌కు డిగ్రీలు ఉంటే స‌రిపోదు.. క‌ష్ట‌ప‌డి చ‌దివితేనే ప్ర‌భుత్వ ఉద్యోగం వ‌స్తుంద‌ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డి స్ప‌ష్టం చేశారు. మంచి ఉద్యోగంతో పాటు మంచి పార్ట్‌న‌ర్‌ను సంపాదించుకోవాల‌ని మంత్రి సూచించారు. త‌న ప్ర‌సంగంతో ఉద్యోగ అభ్య‌ర్థుల్లో మ‌ల్లారెడ్డి జోష్ నింపారు. పీర్జాదిగూడ ప‌రిధిలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంట‌ర్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో మంత్రి మ‌ల్లారెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు.

శాస‌న‌మండ‌లి చైర్మ‌న్‌గా గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, రెండో సారి పదవీ బాధ్యతలు స్వీకరించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ

ప్ర‌పంచంలో ఉన్న టాప్ ఇంజినీర్లు, డాక్ట‌ర్లు, సైంటిస్టులు మ‌న తెలంగాణ వారే. తెలుగు వారికి తెలివితేట‌లు ఎక్కువ‌. స్కిల్, చాలెంజ్‌తో పాటు క‌సి ఎక్కువ‌. యువ‌త‌కు గ‌త గ‌వ‌ర్న‌మెంట్లు మ‌ద్ద‌తు తెలుప‌లేదు. అందుకే ఇత‌ర దేశాల‌కు వెళ్లి సెటిల‌య్యారు. మ‌న కేసీఆర్ సీఎం అయ్యాక‌, యువ‌త‌, తెలివిప‌రులు మ‌న ద‌గ్గ‌రే ఉండాలని, తెలంగాణ‌ను అభివృద్ది చేసుకోవాల‌నే ఉద్దేశంతో యువ‌త‌కు ఇక్క‌డే ఉద్యోగ అవ‌కాశాల‌ను క‌ల్పిస్తున్నారు. ప్ర‌పంచంలోని టాప్ మోస్ట్ కంపెనీల‌ను కేటీఆర్ రాష్ట్రానికి తీసుకొచ్చారు. మ‌న వ‌ద్ద ప్ర‌భుత్వ, ప్ర‌యివేటు ఉద్యోగాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని మంత్రి మ‌ల్లారెడ్డి తెలిపారు.