Hyd, Mar14: తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. మండలి చైర్మన్‌గా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ( legislative council chairman ) ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు ఒకే ఒక్క నామినేషన్ రావడంతో.. గుత్తా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డిని చైర్మన్ సీటు వద్దకు మంత్రులు ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు ఎమ్మెల్సీలు తీసుకెళ్లారు. చైర్మన్ సీటులో ఆశీనులైన గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
2019, సెప్టెంబర్ 11న తొలిసారిగా గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2021, జూన్ మొదటి వారం వరకు గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్‌గా సేవలందించారు. గుత్తా ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడంతో.. ఆయన స్థానంలో ప్రొటెం చైర్మన్‌గా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని నియమించారు. అనంతరం మండలి ప్రొటెం చైర్మన్‌గా ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ నియామకం అయ్యారు.
రేపటితో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముగింపు, ఆరో రోజు అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చలు
శాసనమండలికి 2021లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్ రెడ్డి రెండోసారి నవంబర్ 22న ఎన్నికయ్యారు. ఈ క్రమంలో మళ్లీ ఆయన రెండో సారి మండలి చైర్మన్‌గా నేడు బాధ్యతలు స్వీకరించారు. నల్లగొండ జిల్లా ఊరుమడ్ల గ్రామంలో 1954, ఫిబ్రవరి 2న జన్మించిన గుత్తా సుఖేందర్ రెడ్డి.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. 1977, మే 1న అరుంధతితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.