TS DOST 2021 Notification Released: డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్‌ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్రంలో ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు రద్దు, గురుకులాల్లో సబ్జెక్ట్‌ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ ఫలితాలు సోమవారం వెల్లడైన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం (TS DOST 2021 notification released) తీసుకుంది.

Representational Image | File Photo

Hyderabad, June 29: తెలంగాణలో ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలను ప్రభుత్వం రద్దు (cancelled open school tenth and intermediate exams) చేస్తూ నిర్ణయం తీసుకుంది. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా పరిగణిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులందరికీ కనీసం 35 మార్కులు వేసి ఉత్తీర్ణులను చేయాలని నిర్ణయించింది. కొవిడ్‌ నేపథ్యంలో పరీక్ష నిర్వహణ సాధ్యం కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలోని ఆయా యూనివ‌ర్సిటీల ప‌రిధిలోని డిగ్రీ కాలేజీల్లో (Degree) ప్ర‌వేశాల‌కు దోస్త్ నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ ఫలితాలు సోమవారం వెల్లడైన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం (TS DOST 2021 notification released) తీసుకుంది. జూలై 1వ తేదీ నుంచి వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. అర్హ‌త క‌లిగిన విద్యార్థులు జులై 1 నుంచి 15వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

తెలంగాణ ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, 4,51,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణత, ఫస్టియర్‌ మార్కుల ఆధారంగా సెకండియర్‌ మార్కులు

ఆన్‌లైన్‌లో (Online) ద‌ర‌ఖాస్తు చేసుకున్న విద్యార్థులు జులై 3 నుంచి 16వ తేదీ వ‌ర‌కు వెబ్ ఆప్ష‌న్స్ ఇచ్చుకోవ‌చ్చు. జులై 22న సీట్ల కేటాయింపు ఉంటుంది. 23వ తేదీ నుంచి జులై 27వ తేదీ వ‌ర‌కు సెల్ఫ్ రిపోర్టు చేయాలి. బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం వొకేష‌న‌ల్, బీకాం హాన‌ర్స్, బీఎస్‌డ‌బ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏతో పాటు ఇత‌ర కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. ఉస్మానియా, కాక‌తీయ‌, తెలంగాణ‌, మ‌హాత్మాగాంధీ, పాల‌మూరు, శాత‌వాహ‌న యూనివ‌ర్సిటీల ప‌రిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్ర‌వేశాలు క‌ల్పించ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది.

టీ-యాప్‌ ఫోలియో మొబైల్ యాప్ ద్వారా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందుకు గాను విద్యార్థి ఇంటర్ హాల్‌ టికెట్ నంబర్‌, పుట్టిన తేదీ, ఆధార్‌, ఫోన్‌ నంబరు నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కోసం 105 హెల్ప్‌ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. www.dost.cgg.gov.in ద్వారా అడ్మిషన్లు జరుగుతాయి.

దోస్త్ నోటిఫికేష‌న్ వివరాలు

►జులై 1 నుంచి 15 వరకు తొలి విడత రిజిస్ట్రేషన్లు, ఫీజు రూ.200

►జులై 3 నుంచి 16 వరకు వెబ్‌ ఆప్షన్లు, జులై 22న సీట్ల కేటాయింపు

►జులై 23 నుంచి 27 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు, ఫీజు రూ.400

►జులై 24 నుంచి 29 వరకు వెబ్‌ ఆప్షన్లు, ఆగస్టు 4న సీట్ల కేటాయింపు

►ఆగస్టు 5 నుంచి 10 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లు, ఫీజు రూ.400

►ఆగస్టు 6 నుంచి 11 వరకు వెబ్‌ ఆప్షన్లు, ఆగస్టు 18న సీట్ల కేటాయింపు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఏపీపీఎస్సీ పోటీ పరీక్షల్లో అన్ని ఇంటర్వ్యూలు రద్దు, ఆదేశాలు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని తెలిపిన ప్ర‌భుత్వం, ఏపీ ఈఏపీసెట్‌–2021కు దరఖాస్తుల స్వీకరణ

ఇక హైదరాబాద్‌లోని తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల ఎడ్యుకేషన్ సొసైటీలకు (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ, టీటీడబ్ల్యూఆర్‌ఈఐ) చెందిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కాలేజీల్లో 2021–22 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన జేఈఈ మెయిన్స్‌/అడ్వాన్స్‌డ్, నీట్, ఎంసెట్‌ శిక్షణ కోసం పార్ట్‌టైం సబ్జెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 110, పోస్టుల వివరాలు: మ్యాథ్స్‌–16, ఫిజిక్స్‌–20, కెమిస్ట్రీ–24, బోటనీ–23, జువాలజీ–24, సివిక్స్‌–02, ఎకనమిక్స్‌–01. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు బీఈడీ పూర్తిచేసి ఉండాలి. జేఈఈ మెయిన్స్‌/అడ్వాన్స్‌డ్, నీట్, ఎంసెట్‌ టీచింగ్‌ అనుభవంతోపాటు సంబంధిత సర్టిఫికేట్‌ ఉండాలి. ఎంపిక విధానం: సంబంధిత సబ్జెక్టుల్లో ప్రొఫిషియన్సీ, ఇంగ్లిష్‌లో కమ్యూనికేటివ్‌ స్కిల్స్, జేఈఈ/నీట్‌/ఎంసెట్‌ పరీక్షా విధానం గురించి తెలిసి ఉండాలి. వీటన్నింటి ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్షా విధానం: ఎంపిక ప్రక్రియను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో 50 మార్కులకు స్క్రీనింగ్‌ టెస్ట్, 25 మార్కులకు డెమో, మరో 25 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. స్క్రీనింగ్‌ టెస్ట్‌ల్లో అభ్యర్థి మాస్టర్స్‌ డిగ్రీ మెయిన్‌ సబ్జెక్ట్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షలో నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం 60 నిమిషాలు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► వేతనం: నెలకు రూ.25,000 చెల్లిస్తారు.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 01.07.2021

► పరీక్ష తేది: 10.07.2021

► డెమో/ఇంటర్వ్యూ తేది: 18.07.2021

► వెబ్‌సైట్‌: https://tgtwgurukulam.telangana.gov.in